TS Schools: మారనున్న తెలంగాణ సర్కారు బడుల రూపురేఖలు.. హైటెక్ హంగులు
TS Schools: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారబోతున్నాయి. హైటెక్ హంగులు సంతరించుకోనున్నాయి. అంతేకాదు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే..
TS Schools: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారబోతున్నాయి. హైటెక్ హంగులు సంతరించుకోనున్నాయి. అంతేకాదు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలను కూడా చేపట్టబోతోంది ప్రభుత్వం. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో (Schools) చదివే విద్యార్థుల్లోని సృజనాత్మక వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్ (Minister KTR). హైదరాబాద్‌లోని తారామతి భారదరి రిసార్ట్‌లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021-22 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌పై ప్రసంగించారు. ప్రభుత్వ స్కూల్లో చదవుతున్న విద్యార్థుల ఆలోచనల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
పేరెంట్స్ కూడా తమ పిల్లలకు డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని రెండు ఆప్షన్స్ మాత్రమే ఇస్తున్నారని, దీనివల్ల వారిలోని సృజనాత్మకత నశించిపోతోందన్నారు. ఇక వారు కొత్తగా ఆలోచించలుకపోతున్నారని, ఇకపై దీన్ని మార్చాలన్నారు. ఉద్యోగం చేయడానికి చదవకుండా కొన్ని వేల మందికి ఉద్యోగం కల్పించేలా విద్యార్థులు ఎదగాలని, ఆ వైపుగా వారిని గైడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.
కొత్తగా యూత్ హబ్ ను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ యూత్ హబ్ కోసం 6 కోట్ల రూపాయలతో ఫండ్‌తో ఏర్పాటు చేయబోతున్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద 12 రకాల అంశాలను ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. అదనపు తరగతి గదులు, ఫర్నీచర్, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇవ్వబోతున్నామని తెలిపారు. మన ఊరు మన బడి పథకం దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: