AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణకు కేంద్రం మరో భారీ గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీపికబురు అందించింది. 15వ ఆర్దిక సంఘం నిధులను రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్రం ఆర్ధికశాఖ రిలీజ్ చేసింది. పంచాయతీలకు ఎన్నికలు ముగియడంతో ఆర్ధిక సంఘం నిధులను విడుదల చేస్తున్నట్లు తన ప్రకటనలో కేంద్రం తెలిపింది.

Telangana: తెలంగాణకు కేంద్రం మరో భారీ గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
Grama Panchayat
Venkatrao Lella
|

Updated on: Feb 05, 2026 | 12:28 PM

Share

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం ఒకేసారి భారీగా నిధులు విడుదల చేసింది. గత ఏడాది చివరిలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు నిధులు విడుదల చేసింది. దేశంలోని గ్రామ పంచాయతీల అభివృద్దికి కేంద్రం ఆర్ధిక సంఘం నిధులు అందిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తై సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టడం, పంచాయతీల్లో పాలన ఊపందుకోవడంతో కేంద్రం ఇప్పుడు నిధులు విడుదల చేసింది. దీంతో పంచాయతీల్లో ప్రజలకు రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

ఎంత నిధులు వచ్చాయంటే..?

తెలంగాణలోని పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్ధిక సంఘం నిధులను జనవరి 5వ తేదీన విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లను రిలీజ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తై పాలన మొదలుకావడంతో వీటిని విడుదల చేసింది. ఇంకా దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా నిధులు కేంద్రం నుంచి రాష్ట్రంలోని పంచాయతీలకు అందాల్సి ఉంది. వీటిని విడుతల వారీగా కేంద్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే గ్రామ పంచాయతీల్లో పాలకుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం గతంలో నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఎన్నికలు ముగియడంతో సాంకేతికంగా అడ్డుంకులు తొలగిపోవడంతో గురువారం విడుదల చేసింది.

గ్రామాలకు మహర్ధశ

ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు షురూ కానున్నాయి. వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధం, ఇతర పనులకు ఆ నిధులను ఉపయోగించనున్నారు. అయితే ఈ నిధులు రావడంతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపించారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. కేంద్ర ఉన్నతాధికారులు, ఆర్ధికశాఖ అధికారులతో పలుమార్లు మాట్లాడారు. దీంతో కేంద్రం 15వ ఆర్ధిక సంఘం నిధులు మంజూరు చేసింది.

Follow Us
ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ
మహా శివరాత్రి వేడుకలు.. భక్తి పాటలకు హీరోయిన్ల స్టెప్పులు..వీడియో
మహా శివరాత్రి వేడుకలు.. భక్తి పాటలకు హీరోయిన్ల స్టెప్పులు..వీడియో
SIP Vs PPF.. ఏ ప్లాన్ ఎవరికి సరైనది?.. పూర్తి వివరాలు ఇవే!
SIP Vs PPF.. ఏ ప్లాన్ ఎవరికి సరైనది?.. పూర్తి వివరాలు ఇవే!
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? పంజాబ్ గబ్బర్ ఫామ్ పోయిందా ?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? పంజాబ్ గబ్బర్ ఫామ్ పోయిందా ?
చింతలమోరి శివాలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు
చింతలమోరి శివాలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు
వారికి ఈ ప్రయోజనాలు వర్తించవా? వాస్తవం ఏంటంటే..?
వారికి ఈ ప్రయోజనాలు వర్తించవా? వాస్తవం ఏంటంటే..?
బార్బీలు ఎవరు?.. ఈ బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎందుకు?
బార్బీలు ఎవరు?.. ఈ బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎందుకు?
ఫిబ్రవరి 17న రాహుగ్రస్త సూర్యగ్రహణం... భారత్‌పై ఎఫెక్ట్‌ ఎంత
ఫిబ్రవరి 17న రాహుగ్రస్త సూర్యగ్రహణం... భారత్‌పై ఎఫెక్ట్‌ ఎంత
పొరపాటున కూడా వీటిని కాకరకాయలతో కలిపి తినకండి.. లేదంటే
పొరపాటున కూడా వీటిని కాకరకాయలతో కలిపి తినకండి.. లేదంటే
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్‌ లింక్ ఇదే
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్‌ లింక్ ఇదే