GST Compensation: జీఎస్టీ పరిహారం 12వ వాయిదా విడుదల.. తెలంగాణకు కేంద్రం ఎంత కేటాయించిందంటే..

GST Compensation: జీఎస్టీ నష్ట పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 12వ విడత నిధులను విడుదల చేసింది. మొత్తం రూ. 6 వేల కోట్లు విడుదల...

GST Compensation: జీఎస్టీ పరిహారం 12వ వాయిదా విడుదల.. తెలంగాణకు కేంద్రం ఎంత కేటాయించిందంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 19, 2021 | 10:51 AM

GST Compensation: జీఎస్టీ నష్ట పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 12వ విడత నిధులను విడుదల చేసింది. మొత్తం రూ. 6 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా, తాజాగా విడుదల చేసిన మొత్తంలో రూ. 483.40 కోట్లు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించగా.. రూ.5,516.60 కోట్లు రాష్ట్రాలకు కేటాయించింది. ఇదిలాఉంటే జీఎస్టీ నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాలకు రూ.72వేల కోట్లు విడుదల చేసింది. వీటిలో తెలంగాణకు రూ.1,206,87 కోట్లు రాగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,684.89 కోట్లు వచ్చాయి.

ఇదిలా ఉండగా, 15వ ఆర్థిక సంఘం 2020-21 ఆర్థిక సంవత్సరానికి చేసిన సూచనలను కేంద్రం పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణకు రూ. 723 కోట్లు నష్టం వాటిళ్లిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆ నిధులను విడుదల చేయాలని కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆయన కోరారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేిన గ్రాంట్లను బడ్జెట్‌లో పొందుపరిచినప్పటికీ.. కేంద్రం దానిని అమలు చేయడం లేదని ఆరోపించారు.

Also read:

Jackson Moonwalks At Work: 16 ఏళ్లుగా పాప్ రారాజు స్టెప్స్ వేస్తూ ట్రాఫిక్‌ని నియంత్రిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

Kajal Aggarwal: ఒకప్పుడు అలాంటి వారిని చూస్తే కోపం వచ్చేది.. ఇప్పుడు పాపం అనిపిస్తుంది..