Telangana Corona Update: తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులంటే..
Telangana Corona Update: కరోనా టీకా వచ్చినప్పటికీ.. వైరస్ మహమ్మారి వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా..
Telangana Corona Update: కరోనా టీకా వచ్చినప్పటికీ.. వైరస్ మహమ్మారి వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 256 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక నిన్న ఒక్కరోజు 298 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,92,128 మంది కరోనా పడ్డారు. వీరిలో 2,86,542 మంది కరోనాను జయించి పూర్తి ఆరోగ్యవంతులయ్యారు.
అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,581 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,005 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో 2,283 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతం ఉండగా, రికవరీ రేటు 98.08 శాతంగా ఉంది. ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే తాజాగా నమైద కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 51 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత స్థానాల్లో మేడ్చల్ మల్కాజిగిరి 17, రంగారెడ్డి జిల్లా 15 చొప్పున కొత్త కేసులు నమోదు అయ్యాయి.
Also read:
కోవిడ్ పాండమిక్ భయం, గణ తంత్ర దినోత్సవాలకు 15 ఏళ్ళ లోపు పిల్లలకు నో పర్మిషన్, పరేడ్ రూట్ కుదింపు
Abhishek Agarwal: ఆ సినిమాపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. ఎందుకో తెలుసా..