AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారైంది.. ఎప్పుడంటే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన ఖరారైపోయింది. అక్టోబర్‌ 3వ తేదీ నుంచి ఈ బృందం రాష్ట్రంలో పర్యటన చేయనుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది ఈ ఎన్నికల కమిషన్ బృందం. అయితే రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు. నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో సహా జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలతో ఈ బృందం సమావేశం కానుంది.

Telangana: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారైంది.. ఎప్పుడంటే
Election Commission Of India
Aravind B
|

Updated on: Sep 18, 2023 | 5:11 PM

Share

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన ఖరారైపోయింది. అక్టోబర్‌ 3వ తేదీ నుంచి ఈ బృందం రాష్ట్రంలో పర్యటన చేయనుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది ఈ ఎన్నికల కమిషన్ బృందం. అయితే రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు. నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో సహా జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలతో ఈ బృందం సమావేశం కానుంది. అంతేకాదు ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా డబ్బులు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చలు జరపనుంది. మరోవైపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల నోడల్‌ అధికారులతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భాగంగా భద్రతా పరమైనటువంటి ప్రణాళికలు, ఏర్పాట్లపై సమీక్ష చేస్తారు.

ఇదిలా ఉండగా..రెండో రోజున అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఎన్నికల సంఘం బృందం సమావేశం కానుంది. అయితే జిల్లాల వారీగా ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లకు సంబంధించిన విషయాలపై సమీక్ష జరపనుంది. అలాగే మూడవ రోజున రాష్ట్ర సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష చేస్తారు. అంతేకాదు ఓటర్లకు సైతం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించే విషయంపై ఎన్నికల సంఘం బృందం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అలాగే ఓటర్ల జాబితాను, పౌరుల భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానుంది. ఈ విషయాల్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వివరించారు.

ఇదిలా ఉండగా.. మరోవైపు ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించేశారు. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను వెతుకునే పనిలో పడ్డాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని పలువురు చెబుతున్నారు. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల దిశగా నిర్ణయం తీసుకోనుందని జోరుగా ప్రచారాలు జరగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలు ముగిసేలోపు ఈ జమిలి ఎన్నికలు నిర్వహించేలా నిర్ణయం తీసుకుంటారా.. లేదా అన్న విషయంపై ఓ స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..