5

Minister Kishan Reddy: సోనియాను తెలంగాణ తల్లిగా చిత్రీకరించడమేంటి.. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..

కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సోనియాగాంధీని తెలంగాణ తల్లిగా చిత్రీకరించడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి, సనాతన ధర్మంపై వారి అభిప్రాయాలను ఆయన ప్రస్తావించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుందని మంత్రి అన్నారు. ఆ ధర్మాన్ని ఫాలో అయ్యేవారిని లేకుండా చేయడమే వారి ఉద్దేశం అనుకుంట అని అభిప్రాయపడ్డారు.

Minister Kishan Reddy: సోనియాను తెలంగాణ తల్లిగా చిత్రీకరించడమేంటి.. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..
G. Kishan Reddy
Follow us

|

Updated on: Sep 18, 2023 | 5:44 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తుక్కుగూడలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ విజయభేరి సభ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సోనియాగాంధీని తెలంగాణ తల్లిగా చిత్రీకరించడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి, సనాతన ధర్మంపై వారి అభిప్రాయాలను ఆయన ప్రస్తావించారు. సనాతన ధర్మాన్ని లేకుండా చేయడానికి, దాన్ని అనుసరించేవారిని నిర్మూలించడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్వీట్టర్ ఖాతాలో ఆ వివరాలను వెల్లడించారు.“భారతదేశం అంతటా, శక్తి స్త్రీ రూపాన్ని, మాతృ దేవత వివిధ వ్యక్తీకరణలను సనాతన ధర్మంలో పూజిస్తారు. తెలంగాణలోని ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంది. గ్రామాన్ని రక్షించే, ప్రజలకు శక్తినిచ్చే దేవత. గ్రామంలోని ప్రజలు నిత్యం దేవత ఆశీస్సులు కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిపరురాలైన కాంగ్రెస్ నాయకురాలిని తెలంగాణ తల్లిగా చిత్రీకరించి ఒక కుటుంబం కోసం ఇలా అసభ్యకరమైన ప్రవర్తిస్తూ సనాతన ధర్మాన్ని అవమానించడం దిగ్భ్రాంతికరం అంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

బీజేపీ హయాంలో అనేక రాష్ట్రాల విభజన ఎంతో సాఫీగా సాగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన తెలంగాణ ఏర్పాటు ఎంత గందరగోళం మధ్య జరిగిందో అందరికీ తెలుసన్నారు. పెప్పర్ స్ప్రే ప్రయోగం జరగలేదా..? పార్లమెంట్ డోర్స్ బంద్ చేయలేదా..? అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ భవనం చరిత్ర గురించి చెబుతూ ప్రధాని ఆ విషయాలు గుర్తు చేశారని అన్నారు.

కానీ, కేసీఆర్, కేటీఆర్‌కు విమోచన దినానికి, సమైక్యత దినానికి తేడా తెలియదన్నారు. 80 వేల పుస్తకాలు చదివాను అని చెప్పుకునే వ్యక్తికి చరిత్ర తెలియదా? అని ఎద్దేవ చేశారు. బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటంపై అనేక సినిమాలు వచ్చాయని.. తెలంగాణ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటం మీద సినిమా తీస్తే తప్పేంటని ప్రశ్నించారు.

ఆ చరిత్ర తెలీకుండా చేశారు..

పాకిస్తాన్ లో కలుస్తామని చెప్పిన నైజాం మీద యుద్ధం జరిగింది. ఆ తర్వాతే విముక్తి లభించింది. ఇది చరిత్ర, ఇన్నాళ్ళుగా తెలంగాణలో తర్వాతి తరాలకు ఈ చరిత్ర తెలీకుండా చేశారని.. తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం ఎలా వచ్చిందో అందరికీ తెలియాలన్నారు. రజాకార్ల హింస గురించి చెప్పడానికి ఎన్నో ఘటనలు, ఉదంతాలు, ఉదాహరణలు ఉన్నాయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తే..

తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ సమావేశం.. బీఆర్ఎస్ పార్టీ స్పాన్సర్ చేసిన సభ అంటూ ఎద్దేవ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత పెంచేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తే.. మా కార్యకర్తలమీద జులూం ప్రదర్శించారు.. చాలా మంది ఇంకా ఆసుపత్రుల్లో ఉన్నారని..  ధర్నాచౌక్ లో నిరసన తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అనుమతిచ్చిన తర్వాత కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ఒకటే.. కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. ఇవాళ కాకపోయినా.. ఎన్నికల తర్వాతైనా.. కలిసే పార్టీలే. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారు. కానీ బీజేపీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం