Telangana Caste Survey: ఆ జిల్లాల్లో 100 శాతం సమగ్ర కులగణన పూర్తి.. హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే అప్డేట్ ఇదే..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది.. ఈ కులగణన సర్వేలో భాగంగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ వివరాలను సేకరిస్తున్నారు. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,41,017 నివాసాలు గుర్తించగా, నిన్నటి వరకు 1,01,40,767 నివాసాలలో సర్వే పూర్తి చేసి 87.1 శాతం సాధించింది.

Telangana Caste Survey: ఆ జిల్లాల్లో 100 శాతం సమగ్ర కులగణన పూర్తి.. హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే అప్డేట్ ఇదే..
Telangana Caste Survey
Follow us
Sravan Kumar B

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 23, 2024 | 3:19 PM

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది.. ఈ కులగణన సర్వేలో భాగంగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ వివరాలను సేకరిస్తున్నారు. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,41,017 నివాసాలు గుర్తించగా, నిన్నటి వరకు 1,01,40,767 నివాసాలలో సర్వే పూర్తి చేసి 87.1 శాతం సాధించింది. జనగాం, ములుగు జిల్లాలలో ఇప్పటికే వంద శాతం సర్వే పూర్తయింది. మెదక్, నల్గొండ జిల్లాలో 99.9 శాతంతో పూర్తి కావొస్తుంది. మిగతా 23 జిల్లాలలో జోగుళాంబ గద్వాల్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, ఖమ్మం, నారాయణపేట, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి, సూర్యాపేట, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, నిర్మల్, వరంగల్, సిద్దిపేట 90 శాతం పైగా సర్వే పూర్తయింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హన్మకొండ జిల్లాలో కూడా 80 శాతానికి పైగా సర్వే పూర్తయింది. అదేవిధంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 75.1 శాతం సర్వే పూర్తయింది.

ఇక గ్రేటర్ హైదరాబాద్ (జిహెచ్ఎంసీ) పరిధిలో కూడా సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా నేటివరకు 16,37,563 నివాసాలు సర్వే పూర్తిచేశారు.. ఇప్పటివరకు 65.4 శాతం పూర్తియినట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేలో మొదటినుంచి ఎన్నో అనుమానాలు విమర్శలు ఉన్నా.. ఈ కార్యక్రమం సజావుగా సాగుతోంది.

అయితే.. కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ప్రైవేటు వ్యక్తులు కుటుంబాల వివరాలు సేకరిస్తున్నారని దీనివల్ల ప్రజల సమాచారంపై భద్రత ఎక్కడుందని ప్రచారం సాగింది. మరికొన్ని చోట్ల సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన పత్రాలు రోడ్డుమీద పడేసిన సంఘటనలు.. మరోచోట ఎన్యుమరేటర్లు ఫిల్ చేసిన అప్లికేషన్స్ రోడ్డు మీద పడిసిన ఘటనలు, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి.. ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వం అనుకున్నట్టు ఈనెలాఖరులోపు సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ఓ ప్రణాళికతో ముందుకు సాగుతోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ