AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అద్దిరిపోయే ఆఫర్.. రూపాయికే డ్రెస్.. కట్ చేస్తే.. చివరికి దేవుడు కనిపించాడు

ఓ బట్టల షాపు షో రూం యజమాన్యం చేసిన ఓ మార్కెటింగ్ స్టంట్ బాంబులా బెడిసికొట్టింది. యువకుల దెబ్బకు వారికి దేవుడు కనిపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సైదాబాద్ సింగరేణి కాలనీ ప్రధాన రోడ్డుపై ఓ బట్టల షాపు ప్రారంభమై సంవత్సరం ముగిసింది.. కేవలం రూపాయకే డ్రెస్ అని ప్రకటించారు.

Hyderabad: అద్దిరిపోయే ఆఫర్.. రూపాయికే డ్రెస్.. కట్ చేస్తే.. చివరికి దేవుడు కనిపించాడు
Viral Video
Ravi Kiran
|

Updated on: Apr 08, 2025 | 6:07 PM

Share

సాధారణంగా పండుగలప్పుడు, వార్షికోత్సవాలప్పుడు కొన్ని షోరూమ్‌లు వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఆ సమయంలో కస్టమర్స్‌ పెద్ద సంఖ్యలోతరలి వచ్చి తక్కువధరకు ఎక్కువ వస్తువులు వస్తుండటంలో భారీగా కొనుగోలు చేస్తుంటారు. అలా ఓ బట్టల షాపు యజమాని తన షోరూమ్‌ వార్షికోత్సవం సందర్భంగా ఒక్కరూపాయికే బ్రాండెడ్‌ డ్రస్‌ అంటూ భారీ ఆఫర్‌ ప్రటించాడు. ఆ తర్వాత ఆ యజమాని తిప్పలు మామూలుగా లేవు. చివరికి మమ్మల్ని రక్షించండి మహాప్రభో అంటూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

కొత్తబట్టలంటే యువతకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. నెలలో ఓ నాలుగు కొత్త డ్రస్సులైనా కొనాలనుకుంటారు. కానీ బడ్జెట్‌ గుర్తుకొచ్చి ఆగిపోతారు. అలాంటివారికి రూపాయికే బ్రాండెడ్‌ డ్రస్‌ వస్తుంది అంటే ఆగుతారా.. సైదాబాద్ సింగరేణి కాలనీ ప్రధాన రోడ్డుపై ఓ బట్టల షాపు ప్రారంభించి సంవత్సరం ముగిసింది. ఈ క్రమంలో తన షో రూం ప్రమోట్ చేసుకోవటానికి.. మార్కెటింగ్ స్టంట్‌లో భాగంగా ఓ పెద్ద ఆఫర్ పెట్టాడు ఆ షాపు యజమాని. కేవలం రూపాయికే డ్రెస్ అని ప్రకటించారు. ఈ విషయం తెలియగానే పెద్ద ఎత్తున యువకులు ఆ షాపు వద్దకు పోటెత్తారు. అక్కడితో ఆగలేదు.

షాపులోకి దూసుకెళ్లి సిబ్బందికి చుక్కలు చూపించారు. ఎవరికి దొరికినవి వారు చుట్టబెట్టుకుని బయటకు వచ్చారు. బయట ఉన్నవాళ్లు చూస్తూ ఊరుకుంటారా.. అలా షాపులోంచి బట్టలు తీసుకొని బయటకు వచ్చిన వారి చేతుల్లోంచి అందరూ తలోటీ లాగేసుకున్నారు. అంత కష్టపడి లోపలినుంచి తెచ్చుకున్నవాళ్లు నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. మరికొంతమంది తోసుకుని మరీ షోరూమ్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వాళ్లను అదుపుచేయడం వారి తరం కాలేదు. దాంతో పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులుకు కూడా అక్కడి పరిస్థితిని చూసి చేతులెత్తేసారు. చేసేది లేక అతి కష్టం మీద సిబ్బంది దుకాణం మూసివేశారు. దీంతో యువకులు వెనుదిరిగారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి 

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే