MLC Kavitha: 5 నెలల తర్వాత ఇంటికొచ్చిన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ శ్రేణుల భారీ స్వాగతం..!
164 రోజుల తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన ఆమె... ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
164 రోజుల తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన ఆమె… ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఇంటికి కవిత చేరుకున్నారు. 5 నెలల తర్వాత ఇంటికొచ్చారు కవిత. కవిత రాకతో ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది. కవిత ఇంటికి ఇప్పటికే పెద్ద ఎత్తున బంధువులు, సన్నిహితులు చేరుకున్నారు. కవితకు వెల్‌కమ్ చెబుతూ హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ చేరుకున్న కవిత… జై తెలంగాణ జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. న్యాయం గెలిచింది… తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా… ఎప్పటికీ న్యాయమే గెలిచి తీరుతుందన్నారు కవిత.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కవిత వెంట ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీ రామారావు, హరీశ్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఇతర కుటుంబసభ్యులు, పార్టీ నేతలు ఉన్నారు. కవిత ఎంతో ఉత్సాహంగా ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి రావడం కనిపించింది. దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవిత హైదరాబాద్ లో అడుగుపెట్టడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. కాగా, కవిత హైదరాబాద్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్ కు వెళతారని తెలుస్తోంది.