TV9 Ismart News: వడ్డీతో సహా తిరిగిస్తామని తీహార్ జైలు బైట వార్నింగ్ || జీలేబీ లంచమడిగిన పోలీసులు

హబ్బ.. మార్చి 15 తారీక్న ఈడీ అధికారులు అదుపులకు తీస్కున్నరంటె.. అద్వరసంది నిన్నటిదంక.. అటీటు ఆర్నెల్లు గావట్టె.. కవితక్క అరెస్టయ్.. ఇగ నిన్న బెయిలిచ్చిర్రుల్లా పెద్దకోర్టోల్లు.. ఇగ సూడుర్రి.. కారుపార్టీ కార్యకర్తలు, అభిమానులంత ఎట్ల సంబురాలు చేస్కున్నరో.. యాడాదిల జరిగే పండుగలన్ని ఒక్కపారే వచ్చినంత సంబురం చేస్కున్నరు. మనం కొనే ప్రతి వస్తువు మీద పన్నేస్తరు..

TV9 Ismart News: వడ్డీతో సహా తిరిగిస్తామని తీహార్ జైలు బైట వార్నింగ్ || జీలేబీ లంచమడిగిన పోలీసులు

|

Updated on: Aug 28, 2024 | 7:58 PM

తీహార్ జైల్లకేలి కవితక్క రిలీజ్
కారుపార్టోల్లంత ఫుల్ జోష్

మేయర్ ఇంటిమీద వోశిర్రు శెత్త
ఎమ్మెల్యే చేశిన పనేనట ఇదంత

పెద్దపల్లి పబ్లిక్కు ఫ్రీగ దొర్కినయ్ కూరగాయలు
మంచిగ కల్శొచ్చినయ్.. బ్యారగాళ్ల పంచాదులు

జిలేజీల లంచం తీస్కున్న యూపీ పోలీసులు
ఫోన్ వొయ్యిందని వస్తె మిఠాయ్ తెమ్మన్నరు

హబ్బ.. మార్చి 15 తారీక్న ఈడీ అధికారులు అదుపులకు తీస్కున్నరంటె.. అద్వరసంది నిన్నటిదంక.. అటీటు ఆర్నెల్లు గావట్టె.. కవితక్క అరెస్టయ్.. ఇగ నిన్న బెయిలిచ్చిర్రుల్లా పెద్దకోర్టోల్లు.. ఇగ సూడుర్రి.. కారుపార్టీ కార్యకర్తలు, అభిమానులంత ఎట్ల సంబురాలు చేస్కున్నరో.. యాడాదిల జరిగే పండుగలన్ని ఒక్కపారే వచ్చినంత సంబురం చేస్కున్నరు..

మనం కొనే ప్రతి వస్తువు మీద పన్నేస్తరు.. వస్తువు కొన్నప్పుడే కాదు దాని వాడకం అయిపోయి చెత్తబుట్టల పడేస్తే ఆ చెత్తమీద కూడ పన్నేసే రూల్ తెచ్చింది అప్పట్ల పాత సర్కారు . ఐతే సర్కారు మారింది గాని చెత్తమీద పన్ను ఇంకా గట్లనే వసూల్ చేస్తుండట కడ్ప మేయర్ .. చెత్తమీద పన్నేంది ఎవ్వలు కట్టకుర్రి అని టీడీపీ ఎమ్మెల్యే.. కట్టకుంటే చెత్త దీస్కపోయేదే లేదని మేయర్ ఇట్ల ఇద్దరి నడ్మ కయ్యం పుట్టి ఏం కతైందో సూడుర్రి

హబ్బ.. ఎంత మంచోల్లమ్మా.. గా యూపీ రాష్టం, హాపూర్ జిల్లా బహదూర్ గంజ్ పోలీసోల్లయితె? మంచితనం అనే పదానికి ఖాకీ యూనిఫారాలు తొడిగితె.. అచ్చం బహదూర్ గంజ్ పోలీసోల్ల లెక్కనే ఉంటది గావచ్చు.. అగొ.. ఫోన్ వొయ్యిందని కంప్లయింటిస్తందుకు వోతె.. ఒక్క పైసగూడ లంచం డిమాండ్ చెయ్యలేదట.. కాకుంటె.. నోరు తీపిచెయ్యమని అడిగిర్రట గీ తమ్మున్ని.. పార్రి వాళ్లు ఏం కోరుకున్నరో సూద్దాం

ఎవ్వలైన పనిచేశేదే జీతం కోసం.. అట్ల చేశ్న పనికి నెలల కమానం జీతం రాకుంటే ఎంత గోసుంటది ఏం కథ. ఒక్క నెల జీతం అటీటైతనే ఇల్లంత ఆగముంటది.. కిస్తీలు కట్టుడు..కిరాయిలు కట్టుడు, బడి పీజులు..బస్సు కిరాయిలు..కూరగాయలు.. కిరాణ సామాన్లు, ఎంత తక్లీవైతది. గదే తీర్ల గోసలు పడ్తున్నం ఏడ్నెల్ల సంది జీతాలు లేక అని పుట్టపర్తి తాగునీల్ల పతకం కార్మికులు యేతీర్ల గోడెల్ల బోస్కుండ్రో సూడుర్రి

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీరుస్తాని రొట్టె ఎత్తుకపోయిందనే కత యాదికుందా.. అగ్గో సేం పెద్దపెల్లి కూరగాయల మార్కెట్ల గసోంటి ముచ్చట్నే అయిందట. హోల్ సేల్గ కూరగాయలు అమ్మేటోల్లు.. రిటైల్గ అంగట్ల కూరగాయలు అమ్మేటోల్లకు నడ్మ పుట్టిన జగడంతోటి , పబ్లిక్కు వారం రోజులకు సరిపడా ప్రీ కూరగాయలొచ్చినయ్యట..అదెట్ల ఏం కథన్నది సూడుర్రి మీరే

వరంగల్ మున్సిపాల్టోల్లు శాన అడ్వాన్సుడు ఉన్నట్టున్నరు..గవర్నమెంటు ఏదన్న ఆలోచన చేస్తే అసెంబ్లీల బిల్లు పాసై , క్యాబినెట్ల నిర్ణయం తీస్కోని దాన్ని ఆమోదించేదాకన్న ఆగేతట్టు లేరు.. ఏలు సూప్తే కొండ వాకినట్టు జెస్టు అట్ల సర్కారేదన్న ఆలోచన చేస్తుందంటే సాలు.. ఇట్ల ఇంప్లిమెంటు చేసేస్తుండ్రట..గంత అడ్వాన్సున్నరట .

శిన్నప్పుడు స్కూల్ల లెక్కల సబ్జెక్టంటె మస్తు భయమయ్యేది.. దేవుడా.. ఆ పదో తర్తిల ఈ లెక్కల గండం గట్టెక్కిస్తె సాల్ దేవుడా.. మల్ల జిందగీల లెక్కల సబ్జెక్టు లేని సద్వే సద్వుత.. అని మొక్కి.. ఎట్లో అట్ల తిప్పల్ వడి ప్యాసైన. మరి నాకు అర్థంగాలేదా? సార్లకు చెప్పరాలేదాన్న సంగతైతె ఇప్పటికి నాకు అర్థమైతలేదుగనీ… ఇగొ.. గీ సారు చెప్పినట్టు లెక్కల్ చెప్తె ఎంత బాగుండు నాగ్గూడ..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us