Harish Rao: అసలు బేసిన్‌ల గురించి సీఎంకు తెలుసా.. రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్!
బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలుగుప్పించారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులపై సీఎంకు విషయం తక్కువ.. విషం ఎక్కువ అని.. ఆయనకు బూతుల గురించి తెలిసినంతగా, బేసిన్ లా గురించి తెలియదని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు బుధవారం తెలంగాణ సచివాలయంలో అఖిలపక్ష నేతలలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నుంచి బనకచర్లకు నీళ్ళు తీసుకెళ్ళమని కేసీఆర్ చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో వాస్తవం లేదని అన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సారాంశంలోని అంశాలను సగం సగం చదివి ప్రజలకు సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ నీటి ప్రాజెక్టులపై సీఎంకు విషయం తక్కువ.. విషం ఎక్కువ అని.. ఆయనకు బూతుల గురించి తెలిసినంతగా, బేసిన్ లా గురించి తెలియదని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి అనుమతులు పొందామన్నారు. అసలు సీఎం మీటింగ్ పెట్టింది.. బనకచర్ల ప్రాజెక్టును ఆపడానికా? లేదా కట్టుకోమని చెప్పడానికి అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులు చంద్రబాబు రాసి ఇస్తామంటే.. తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హరీష్ రావు అన్నారు.
బనకచర్ల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉందో కూడా తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు అని హరీష్ రావు విమర్శించారు. గోదావరి బేసిన్ లో 1000 TMC, కృష్ణ బేసిన్ లో 500 TMCల నీళ్లు ఇచ్చి ఏపీ అన్ని ప్రాజెక్ట్ లు అయిన కట్టుకోండని రేవంత్ అంటున్నారు.. అసలు సీఎం ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుసా అని హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




