MLC kavitha: ఏం జరగబోతోంది? కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు..

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్తున్నారు. ఎందుకని..? పార్టీ ఆదేశాలతో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఆల్రడీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. మిగిలిన వాళ్లు ఉదయం బయల్దేరుతారు. మాజీ మంత్రి కేటీఆర్‌ ఈ ప్రోగ్రామ్‌ను లీడ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఢిల్లీలో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దేశ రాజధానిలో ఏం చేయబోతున్నారు?

MLC kavitha: ఏం జరగబోతోంది? కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు..
MLC kavitha
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 26, 2024 | 8:30 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా ఎమ్మెల్యేలంతా వెళ్తున్నారా? బెయిల్‌ కోసం ఎన్నో సార్లు కోర్టులను ఆశ్రయించారు కవిత. ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా.. ఎక్కడా ఉపశమనం లభించలేదు. అయితే.. కవిత బెయిల్‌ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. కవితను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న కేటీఆర్, హరీష్‌రావు.. వారం క్రితం ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేశారు. వారు ఇచ్చిన భరోసా ప్రకారం.. రేపటి విచారణ తరువాత కవితకు బెయిల్‌ వచ్చి తీరుతుందనే ఆశాభావంతో ఉన్నారు. మనీష్‌ సిసోడియాకు బెయిల్‌ వచ్చిన నేపథ్యంలో.. కవితకు కూడా బెయిల్‌ వస్తుందని భారీ ఆశలతో ఉన్నారు. ఒకవేళ బెయిల్‌ వచ్చి, కవిత జైలు నుంచి బయటకు వస్తే.. పార్టీ మొత్తం కవితకు అండగా నిలిచిందనే సంకేతాలు పంపేలా.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్తోందని చెబుతున్నారు.

ఒకవేళ బెయిల్‌ రాకపోతే.. ప్లాన్‌-Bని సిద్ధం చేసుకున్నారా? కవితను రాజకీయంగా వేధిస్తున్నారంటూ మెరుపు ధర్నా గానీ, ఆందోళనలకు గానీ ప్లాన్ చేశారా? అయితే ఇదంతా సోషల్ మీడియా ప్రచారం గా పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. బెయిల్ రావడానికి అంతా అనుకూలిస్తున్న వేళ ధర్నాలు చేయడం ద్వారా ఇబ్బందులు కూడా ఉంటాయని కొంతమంది నేతలు చెప్తున్నారు.

పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారమైతే.. కవితకు బెయిల్ వస్తుందనే నమ్ముతున్నారు. కవితను ఒక ఊరేగింపుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్లాన్‌లో కూడా ఉన్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్తున్నది కూడా అందుకేనని గట్టిగా చెబుతున్నారు. బెయిల్ వచ్చే అవకాశాలను పరిశీలించిన తర్వాతనే అంతా ఢిల్లీ పయనం అయినట్లు తెలుస్తోంది…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి