Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thummala Nageswara Rao: తుమ్మల దారెటు..? పార్టీ మారాలంటూ అనుచరుల ఒత్తిడి.. త్వరలోనే నిర్ణయం..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారనున్నారా.. అనుచరులతో మంతనాలు జరపడం వెనుక ఉద్దేశ్యమేంటి.. బీఆర్ఎస్‌ టిక్కెట్‌ రాదని కన్ఫామ్‌ చేసుకున్నారా..? అందుకే మరో పార్టీ వైపు అడుగులు వేస్తున్నారా..? తుమ్మల వర్గీయులు, అనుచరులు నిర్వహిస్తున్న సమావేశాలు.. వాళ్లు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు.. తుమ్మలను పార్టీ మారమంటున్నాయా..?

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 30, 2023 | 6:45 PM

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 30: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారనున్నారా.. అనుచరులతో మంతనాలు జరపడం వెనుక ఉద్దేశ్యమేంటి.. బీఆర్ఎస్‌ టిక్కెట్‌ రాదని కన్ఫామ్‌ చేసుకున్నారా..? అందుకే మరో పార్టీ వైపు అడుగులు వేస్తున్నారా..? తుమ్మల వర్గీయులు, అనుచరులు నిర్వహిస్తున్న సమావేశాలు.. వాళ్లు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు.. తుమ్మలను పార్టీ మారమంటున్నాయా..? అంటే, అవునంటున్నాయి జరుగుతున్న పరిణామాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గండుగులపల్లిలోని నివాసంలో తుమ్మల నాగేశ్వరరావును పలువురు నాయకులు కలిశారు. ఈ భేటీలో పాలేరు నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పార్టీ మారాలని, ఎన్నికల్లో నిలబడాలని నేతలు తుమ్మలను కోరారు. చివరకు మళ్లీ ప్రయత్నించాలని.. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారైనా పోటీ చేయాలంటూ సూచించారు.

కాగా.. తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేదు. 2018లో కాంగ్రెస్ లో గెలుపొంది.. బీఆర్ఎస్ లో చేరిన కందాళ ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో అసంతృప్తికి గురైన తుమ్మల నాగేశ్వరరావు.. ఎన్నికల్లో పోటీ చేయడం పక్కా అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం వెల్లడించలేదు. దీంతో పార్టీ మార్పుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ లో చేరాలంటూ పట్టుబడుతున్నట్లు సమాచారం.. అయితే, తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. అందుకే తుమ్మల అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

టికెట్ రాలేదన్న కారణంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావును ఎంపీ నామా నాగేశ్వరరావుతో అధిష్టానం బుజ్జగింపులకు ప్రయత్నించింది. అయినప్పటికీ.. తుమ్మల ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వయ్యారి స్పర్శకై అందం ఎంతగానో తపిస్తుంది.. స్టన్నింగ్ ప్రగ్య..
ఈ వయ్యారి స్పర్శకై అందం ఎంతగానో తపిస్తుంది.. స్టన్నింగ్ ప్రగ్య..
తలనొప్పి తగ్గించుకునేందుకు సింపుల్ టిప్స్ మీకోసం..!
తలనొప్పి తగ్గించుకునేందుకు సింపుల్ టిప్స్ మీకోసం..!
భారత్‌లో 'టెస్లా' ట్రెండింగ్.. ఎంట్రీ లెవెల్ మోడల్ ధర తెలిస్తే..
భారత్‌లో 'టెస్లా' ట్రెండింగ్.. ఎంట్రీ లెవెల్ మోడల్ ధర తెలిస్తే..
విద్యార్థికి తృటిలో తప్పిన ప్రాణాపాయం..స్కూల్‌లో జరిగిన ప్రమాదంతో
విద్యార్థికి తృటిలో తప్పిన ప్రాణాపాయం..స్కూల్‌లో జరిగిన ప్రమాదంతో
బయటపడ్డ ఆన్‌లైన్ జ్యోతిష్యుడి భాగోతం.. యువతిని బెదిరించి..
బయటపడ్డ ఆన్‌లైన్ జ్యోతిష్యుడి భాగోతం.. యువతిని బెదిరించి..
పక్కా ఫ్లాన్ చేశాడు.. బార్డర్ దాటించిన బంగారం సీజ్!
పక్కా ఫ్లాన్ చేశాడు.. బార్డర్ దాటించిన బంగారం సీజ్!
స్టార్ ఫ్రూట్స్‌ తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే ముక్కకూడా వదలరు
స్టార్ ఫ్రూట్స్‌ తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే ముక్కకూడా వదలరు
యాక్టింగ్ మానేసి ప్లాస్టిక్ సర్జన్ కావాలనుకుంటున్న ముద్దుగుమ్మ..
యాక్టింగ్ మానేసి ప్లాస్టిక్ సర్జన్ కావాలనుకుంటున్న ముద్దుగుమ్మ..
ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్‌..
ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్‌..
ఆహా ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ..
ఆహా ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ..