Big News Big Debate: మేడిన్ తెలంగాణ స్కీమ్స్.. హామీల అమల్లో ఛాంపియన్ ఎవరు..? గరం గరం పాలిటిక్స్..
Big News Big Debate: ఎన్నికల్లో పోటీ పడి మరీ వాగ్ధానాలు చేయడం సులభమే.. కానీ అమలు చేయడమే పార్టీల ముందున్న పెద్ద సవాల్. తెలంగాణలోనూ ఎన్నికల సీజన్ మొదలైంది కదా.. అందుకే హామీలు గుప్పిస్తున్నాయి ప్రధానపార్టీలు. అదే సమయంలో వాటిని అమలు చేస్తామని పదేపదే చెప్పుకోవాల్సి వస్తోంది. ప్రత్యర్ధులను రాజకీయంగా టార్గెట్ చేస్తూనే తామిచ్చిన ప్రామిస్‌లపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
Big News Big Debate: ఎన్నికల్లో పోటీ పడి మరీ వాగ్ధానాలు చేయడం సులభమే.. కానీ అమలు చేయడమే పార్టీల ముందున్న పెద్ద సవాల్. తెలంగాణలోనూ ఎన్నికల సీజన్ మొదలైంది కదా.. అందుకే హామీలు గుప్పిస్తున్నాయి ప్రధానపార్టీలు. అదే సమయంలో వాటిని అమలు చేస్తామని పదేపదే చెప్పుకోవాల్సి వస్తోంది. ప్రత్యర్ధులను రాజకీయంగా టార్గెట్ చేస్తూనే తామిచ్చిన ప్రామిస్‌లపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మరి జనాలు ఎంతవరకూ విశ్వసిస్తారు.
- డిక్లరేషన్ల పేరుతో దూకుడు పెంచిన కాంగ్రెస్..
- పాత పథకాలతో పాటు కొత్త స్కీములతో వస్తున్న బీఆర్ఎస్..
- పెట్రోలియం, గ్యాస్ ధరలు తగ్గించామని ఘనంగా చాటుకుంటున్న బీజేపీ..
తెలంగాణలో ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించిన పార్టీలు అటు మేనిఫెస్టోలో ఇచ్చే హామీలపైనా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే యువత, రైతు, ఎస్సీ-ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ జనాల్లోకి వచ్చింది. హామీలు అయితే భారీగా ఇస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందా అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి.
అయితే దీనికి ఆన్సర్ అన్నట్టు కర్నాటకను చూపిస్తోంది టీపీసీసీ. ఎన్నికలకు ముందు ఇచ్చిన 5 ప్రధాన హామీల్లో ఇప్పటికే నాలుగు అమలుచేశామని.. మిగిలిన నిరుద్యోగ భృతి ఒక్కటీ వచ్చే నెలలో ఆరంభం అవుతుందంటున్నారు పీసీసీ నేతలు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ చెప్పిన మాటకు కట్టుబడి పథకాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 99 హామీల్లో కేవలం 9 మాత్రమే అమలు చేసిందని ఎదురుదాడి చేస్తున్నారు పీసీసీ పెద్దలు.
తెలంగాణలో ఉన్న పథకాలు ఏ కాంగ్రెస్ రాష్ట్రంలో అయినా ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్.
అటు హామీలు, పథకాల రేసులోకి వచ్చింది బీజేపీ. గతంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించామని.. ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా తగ్గించి సామాన్యులకు భారం లేకుండా చేశామంటోంది బీజేపీ. తెలంగాణ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై కనీసం వ్యాట్ కూడా తగ్గించలేదన్నారు మంత్రి కిషన్ రెడ్డి. హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందే కాంగ్రెస్ అన్నారు.
తెలంగాణలో పథకాల యుద్ధం మొదలైంది. డిక్లరేషన్లు, హామీలతో జనాల్లోకి వస్తున్న పార్టీలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఛాంపియన్‌గా ఎవరు నిలవబోతున్నారు.? అనుభవాలు ఏంచెబుతున్నాయి?
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..