వినూత్న ఆత్మీయ సమ్మేళనం.. సీఏం కేసీఆర్‌పై అభిమానంతో 72 గంటల సామూహిక ప్రార్థనలు.. అసలు విషయం ఏమిటంటే..?
Sangareddy District News: ‘మట్టి మనుషుల మనోగతం.. భూమి పుత్రుల ఆకలి కేక’ అనే పేరుతో ఆత్మీయ సమ్మేళనం వినూత్నంగా నిర్వహించారు సంగారెడ్డి బీఆర్ఎస్ నేత. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పేరుతో వేదికపై కుర్చీలు వేసి.. మధ్యలో పెద్ద చైర్ పై ముఖ్యమంత్రి కేసిఆర్ ఫోటో పెట్టి ఆయా గ్రామాల నుంచి తెచ్చిన మట్టిని కుర్చీల్లో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. జహీరాబాద్ ప్రాంతంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు అందరూ కలికట్టుగా ముందుకు రావాలని వసంత్ పిలుపునిచ్చారు.. అలాగే తమ పరిధిలో ఉన్న సమస్యల పత్రాన్ని ముఖ్యమంత్రి..
సంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 5: సామాజి ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత ఢిల్లీ వసంత్ సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జహీరాబాద్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో వసంత్ తన అనుచరులు, అభిమానులతో జహీరాబాద్ పట్టణంలోన ఓ ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేశారు.. ‘మట్టి మనుషుల మనోగతం.. భూమి పుత్రుల ఆకలి కేక’ అనే పేరుతో ఆత్మీయ సమ్మేళనం వినూత్నంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పేరుతో వేదికపై కుర్చీలు వేసి.. మధ్యలో పెద్ద చైర్ పై ముఖ్యమంత్రి కేసిఆర్ ఫోటో పెట్టి ఆయా గ్రామాల నుంచి తెచ్చిన మట్టిని కుర్చీల్లో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. జహీరాబాద్ ప్రాంతంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు అందరూ కలికట్టుగా ముందుకు రావాలని వసంత్ పిలుపునిచ్చారు.. అలాగే తమ పరిధిలో ఉన్న సమస్యల పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోకు సమర్పించారు.
అచ్చం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభకు వచ్చి కూర్చునట్లుగా సమావేశం ఏర్పాటు చేశారు వసంత్, తదితరులు. స్టేజి పైన ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో తప్ప మరే ఎవరు లేరు.. సమావేశం మొత్తం స్టేజి కింద ఉండే నిర్వహించారు. తాను ఏకలవ్యుడిగా పని చేస్తానంటూ, ముఖ్యమంత్రి మీద అభిమానంతో 72 గంటల పాటు సామూహిక ప్రార్థన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్టేజి మీద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో.. ఆయన ఫోటో చుట్టూ వివిధ గ్రామాల నుండి తెచ్చిన మట్టిని కుర్చీల్లో పెట్టి చేసిన వినూత్న కార్యక్రమం పలువురుని ఆకర్షణకు గురిచేసింది.
కాగా, ఈ కార్యక్రమంలో రైతులు, కార్మికులు, మహిళలు, వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, మేధావులు, నిరుద్యోగులు ఈ ఆత్మీయ సమ్మేళనంకు హాజరైనరు.అలాగే ఢిల్లీ వసంత్ లో బృంద సభ్యులైన మహిపాల్ యాదవ్, బిల్లీ పురం మాధవరెడ్డి, అశోక్ పాటిల్, విశాల్ గోడకే, రహీం ఖురేషి,రమేష్ బాబు కులకర్ణి, అబ్బాస్ మియా, రాజు, కరణం రవి, మల్లేష్ యాదవ్, పాపయ్య, విక్రమ్, ఆనంద్ ఈశ్వర్, హనుమంతు, ఓంకార్, యాసిర్ ఖాన్, బన్సీలాల్, ముదిగొండ శ్రీనివాస్, విష్ణు, శ్రీనివాస్, దినేష్, గోవింద్ రెడ్డి, భూమన్ స్టీవెన్సన్, అనిల్, శంకరయ్య, ఖాదర్, బాలకృష్ణ, హమీద్ సాబ్, గోపాల్ మరియు సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్, వాసుదేవ రెడ్డిలు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..