Telangana: తెలంగాణలో ఎన్నికల జోష్.. హ్యాట్రిక్ విక్టరీ కోసం బీఆర్ఎస్ వ్యూహాలు..
తెలంగాణలో ఎన్నికల జోష్ మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల హడావుడి చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. కాకపోతే, రూలింగ్ పార్టీ ఓ అడుగు ముందున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే రెండుసార్లు విజయఢంకా మోగించి అధికారం చేపట్టిన భారత రాష్ట్రసమితి.. ముచ్చటగా మూడోసారి విక్టరీ కొట్టి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండటంతో

తెలంగాణలో ఎన్నికల జోష్ మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల హడావుడి చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. కాకపోతే, రూలింగ్ పార్టీ ఓ అడుగు ముందున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే రెండుసార్లు విజయఢంకా మోగించి అధికారం చేపట్టిన భారత రాష్ట్రసమితి.. ముచ్చటగా మూడోసారి విక్టరీ కొట్టి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండటంతో అంతకు ముందే తనను తాను మరింత పటిష్ట పర్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరిట కిందిస్థాయి క్యాడర్‌ను ఏకతాటిపైకి తేవడంపై దృష్టిపెట్టిన అధికార పార్టీ.. ఇప్పుడు నియోజకవర్గస్థాయిలో పార్టీని స్ట్రాంగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
అందులో భాగంగానే ఈనెల 25న బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభలు నిర్వహించాలని నిర్ణయించింది. మంత్రులు,ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సభల నిర్వహణపై ప్రధానంగా చర్చించారు. గతంలో తెలంగాణ దుస్థితి ఏమిటి? అభివృద్ధి పనులతో ఇప్పుడు మారిన రాష్ట్ర ముఖచిత్రమేమిటి? అనే అంశంపై.. ఆ సభల్లో తీర్మానాలు చేయాలని ఆదేశించారు కేటీఆర్. కనీసం ఆరు తీర్మానాలు చేయాలని సూచించారు.
ఈ నియోజకవర్గ ప్రతినిధుల సభలతో.. వచ్చే ఎన్నికలకు సమరశంఖం పూరిద్దామని పిలుపునిచ్చారు కేటీఆర్. నేతలు, కార్యకర్తలు కలిసి ఈ మీటింగులను విజయవంతం చేయాలని సూచించారు. ఓవైపు ప్రతిపక్షాలు పాదయాత్రలు, సభలూ సమావేశాలతో హడావుడి చేస్తుండగా.. అధికార బీఆర్‌ఎస్ సైతం ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళ్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాస్త ముందుగానే ఎన్నికల జోష్ కనిపిస్తోంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
