AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: కెరీర్‌ని రివ్యూ చేసిన రష్మిక.. ఇంతకీ ఏమన్నారు

Rashmika Mandanna: కెరీర్‌ని రివ్యూ చేసిన రష్మిక.. ఇంతకీ ఏమన్నారు

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Dec 29, 2025 | 5:03 PM

Share

రష్మిక మందన్న తన సినీ ప్రస్థానంపై హృదయపూర్వక ఆలోచనలను పంచుకున్నారు. నటిగా తన ఎదుగుదల, నేర్చుకున్న పాఠాలు ఆమెకు ఆత్మసంతృప్తినిచ్చాయి. వ్యక్తిగత జీవితానికి, తెరపై పాత్రలకూ తేడా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఆందోళనలను అధిగమించి, నిరంతరం నేర్చుకుంటూ, భాషా సరిహద్దులు లేకుండా తన కెరీర్‌ను విజయవంతంగా మలచుకున్న విధానం స్ఫూర్తిదాయకం.

ఎవరికైనా తమ జర్నీని గుర్తుచేసుకుంటే హార్ట్ ఫుల్‌గా అనిపించాలి. ఏదో చేశామన్న ఆత్మసంతృప్తి ఉండాలి. స్టార్టింగ్‌ పాయింట్‌ నుంచి ఇప్పటిదాకా నడిచొచ్చిన దారిని తలచుకుంటే కొంతైనా నేర్చుకున్నామన్న ఫీలింగ్‌ రావాలి. మనం చేరుకోవాల్సిన తీరం ఇంకా అందంగా ఉందన్న ఆశలు కలగాలి. రష్మిక మాటల్లో ఇవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒక్క ఇమేజ్‌కి పరిమితం కావడం లేదని ఓపెన్అయ్యారు రష్మిక మందన్న. నటిగా, ఎంటర్‌టైనర్‌గా తానేం చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో, ఆదరిస్తారో తనకు చాలా బాగా తెలుసంటున్నారు ఈ లేడీ. పర్సనల్‌ లైఫ్‌లో తనని జస్ట్ మంచి అమ్మాయిగానో, అమాయకురాలిగానో, చిల్‌ లేడీగానో, బ్యాడ్‌ గర్ల్ గానో చూడకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు. తాను స్క్రీన్‌ మీద చేసే రోల్స్ కీ, పర్సనల్‌ లైఫ్‌కి చాలా తేడా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పటికప్పుడు డెవలప్‌ కావడం అంటే రష్మిక మందన్నకు చాలా ఇష్టమట. అందుకోసం ఎక్స్ ట్రా ఎఫర్స్ట్ పెట్టి మరీ తెలియని విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. సెట్ లోనూ డైరక్టర్లు, రైటర్లు ఏం చెప్తే దాన్ని కచ్చితంగా వింటారట ఈ బ్యూటీ. వాళ్ల మనసులోని భావాలపై తన అభిప్రాయాలను రుద్దడం ఇష్టం ఉండదన్నది రష్షీ చెప్పే మాట. భాషా సరిహద్దులు తనకు లేవని నమ్ముతారు నేషనల్‌ క్రష్‌. ఏ భాషలో సినిమాను ఒప్పుకున్నా వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని చెబుతున్నారు. సినిమా చేయడంఅంటే జస్ట్ ఓ కథలో కనిపించడం కాదని, ఆ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా ఉండటమని నమ్ముతారు ఈ లేడీ. నటిగా తన జర్నీని అనుకుంటే హ్యాపీగా ఉందన్నది రష్మిక చెబుతున్న మాట. ఆందోళన, అభద్రత లాంటి పలు నెగటివ్‌ ఫీలింగ్స్ చిన్నప్పటి నుంచీ రష్మికను సతమతం చేశాయట. కానీ, నెమ్మదిగా, స్టడీగా పనిచేస్తూ తన జీవితం ఎలా ఉండాలో అలా మలచుకున్నందుకు ఆనందంగా ఉందంటారు మిస్‌ మందన్న.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే

షుగర్ పేషంట్స్‌కి స్వీట్ వార్నింగ్.. చెక్కర కంటే బెల్లం యమా డేంజర్ గురూ

ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..

షాపింగ్ చేయడం కూడా ఒక రోగమే.. దాని వాళ్ళ కలిగే నష్టాలు తెలిస్తే షాకే

 

Published on: Dec 29, 2025 04:54 PM