AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు విమర్శలపై హరీష్‌రావు కౌంటర్‌

Kaleshwaram Project: మంత్రి ఉత్తమ్‌ వ్యాఖ్యలకు హరీష్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. కాళేశ్వరంపై దుష్ప్రచారాన్ని ఆధారాలతో సహా నిరూపించామని, అయినా ఉత్తమ్ అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. కమీషన్ల కోసం పనులు మొదలుపెట్టి వదిలేయడం తమకు అలవాటు లేదన్నారు. ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్ ఇప్పటికైనా..

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు విమర్శలపై హరీష్‌రావు కౌంటర్‌
Subhash Goud
|

Updated on: Jun 08, 2025 | 7:55 AM

Share

Kaleshwaram Project: కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు పిన్ టు పిన్.. కౌంటర్ ఇచ్చారు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కాళేశ్వరంపై క్లారిటీగా వివరించారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణకు జీవధార లాంటిదన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదన్నారు. కాళేశ్వరం అంటే.. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు అన్నారు. 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజీ, 240 టీఎంసీల నీటి వినియోగం ఇవన్నీ కాళేశ్వరంలో భాగమన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్‌ఎస్‌పై నిందలు వేస్తున్నాయని, 2 పిల్లర్లు కుంగితే, ప్రాజెక్ట్‌ మొత్తం కుంగినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హరీష్‌.

8 ఏళ్లలో కనీసం అనుమతులు తేలేదు:

2007లో ప్రాణహిత చేవేళ్లకు శంకుస్థాపన చేసి.. నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్న కాంగ్రెస్.. 8 ఏళ్లలో కనీసం ప్రాజెక్ట్‌కు అనుమతులు తేలేదని విమర్శించారు హరీష్‌రావు. కాళేశ్వరంతో అనేక చెరువులు, చెక్ డ్యాంలు నింపామన్నారు. కాళేశ్వరం నీళ్లతోనే తెలంగాణలో సాగు పెరిగిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాలు చేస్తోందని టీవీ9తో చెప్పారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఏడాదికి 10 టీఎంసీలకు మించి వాడుకోలేదని, 38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్లను పక్కన పెట్టి..లక్ష కోట్లు వృధా చేసి కాళేశ్వరం కట్టారని విమర్శించారు.

ఇదిలా ఉండగా, మంత్రి ఉత్తమ్‌ వ్యాఖ్యలకు హరీష్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. కాళేశ్వరంపై దుష్ప్రచారాన్ని ఆధారాలతో సహా నిరూపించామని, అయినా ఉత్తమ్ అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. కమీషన్ల కోసం పనులు మొదలుపెట్టి వదిలేయడం తమకు అలవాటు లేదన్నారు. ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్ ఇప్పటికైనా గోబెల్స్‌ ప్రచారం మానుకోవాలన్నారు హరీష్‌రావు.

కాళేశ్వరంతో తెలంగాణకు మేలు జరిగిందని బీఆర్ఎస్ అంటుంటే.. కాళేశ్వరంతో ఉపయోగమే లేదని, పైగా ప్రాణహిత-చేవేళ్ల కట్టకుండా నష్టం చేశారని కాంగ్రెస్ అంటోంది. మొత్తానికి కాళేశ్వరం మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. కాళేశ్వరం కమిషన్‌ ముందు హరీశ్‌, కేసీఆర్ విచారణకు హాజరైన తర్వాత.. ఇంకేం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది.

ఇది కూడా చదవండి: WhatsApp Ban: వాట్సాప్‌ను బ్యాన్‌ చేసిన 6 దేశాలు ఏవో తెలుసా..? కారణం ఏంటి?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి