MLA Maganti Gopinath: నేటి మధ్యాహ్నం మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు.. ప్రముఖుల సంతాపం
త గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు..

హైదరాబాద్, జూన్ 8: బీఆర్‌ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందిన విషయం తెలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశం పంపించారు. జూబ్లీహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరం.3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్న నాయకుడి మరణం ప్రజలకు తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిసున్నా. మాగంటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.
మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. జూబ్లీహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు గుండెపోటుతో కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల తలలో నాలుకగా మారారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం అత్యంత బాధాకరం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి మృతి బి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శం. గోపినాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/llCKHWorzO
— Harish Rao Thanneeru (@BRSHarish) June 8, 2025
కాగా గత గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుకు గురైన మాగంటి సీపీఆర్ తర్వాత మళ్లీ గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది. అయితే అప్పటి నుంచి ఆయన అపస్మారక స్థితి నుంచి బయటపడలేదు. మూడు రోజులుగా వెంటీలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి నేడు కన్నుమూశారు. గోపీనాథ్ భౌతిక కాయాన్ని మాదాపూర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహంచనున్నట్లు కుటుంబ సభ్యులుతెలిపారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణం హైదరాబాద్ నగర ప్రజలతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటు.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, శోఖార్తులైన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం… pic.twitter.com/rK77pMRF4F
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 8, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.