MLC Kavitha: మహారాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం.. బీఆర్‌ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత..
బీఆర్‌ఎస్ విస్తరణలో మరో ముందడుగు పడింది. మహారాష్ట్రలో పార్టీ విస్తరణే లక్ష్యంగా ముంబైలో పర్యటించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహారాష్ట్ర ప్రజల కోరిక మేరకు ఇక్కడా బీఆర్‌ఎస్ పనిచేస్తుందన్నారు.
మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ కచ్చితంగా పనిచేస్తుందన్నారు. ముంబైలో పర్యటించిన కవిత.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కవిత రాకతో ఆ ప్రాంతమంతా మహారాష్ట్ర సాంస్కృతిక సంగీతం, డోలు చప్పుళ్లతో మారుమోగింది. తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు కవిత. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్రలోనూ ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
ముంబైలో రోజుకి రెండు గంటలే మంచినీళ్లు ఇస్తుంటే, హైదరాబాద్‌లో 24గంటలు వాటర్ సప్లై అవుతోందన్నారు కవిత. మహారాష్ట్ర ప్రజల కోరిక మేరకు బీఆర్‌ఎస్‌ను ఇక్కడ కూడా విస్తరిస్తామని చెప్పారు. తెలంగాణలో అమలవుతోన్న పథకాలను మహారాష్ట్ర ప్రజలకు అందించేందుకు బీఆర్‌ఎస్ కృషిచేస్తుందన్నారు కవిత.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..