ఆరు రోజుల్లో పెళ్లి..ట్రాక్టర్ కిందపడి వరుడు మృతి
మరో ఆరు రోజుల్లో పెళ్లి..ఆ కుంటుంబం అంతా ఆనందోత్సవాల్లో ఉంది. పెళ్లికి ముందు జరగాల్సిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. శుభలేఖలు పంచుతూ సన్నిహితులను, బంధుమిత్రులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. కానీ ఇంతలోనే విధికి వారి ఆనందాన్ని చూసి అసూయ వేసింది. రోడ్డు ప్రమాదంలో రూపంలో పెళ్లికుమారుడుని చంపేసింది. ట్రాక్టర్ చక్రాల కింద పడి నలిగిపోయిన అతని మృతదేహం, ఆ పక్కనే పడి ఉన్న అతని వివాహ ఆహ్వన పత్రికలు అందర్ని కంటతడి పెట్టిస్తున్నాయ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం […]

మరో ఆరు రోజుల్లో పెళ్లి..ఆ కుంటుంబం అంతా ఆనందోత్సవాల్లో ఉంది. పెళ్లికి ముందు జరగాల్సిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. శుభలేఖలు పంచుతూ సన్నిహితులను, బంధుమిత్రులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. కానీ ఇంతలోనే విధికి వారి ఆనందాన్ని చూసి అసూయ వేసింది. రోడ్డు ప్రమాదంలో రూపంలో పెళ్లికుమారుడుని చంపేసింది. ట్రాక్టర్ చక్రాల కింద పడి నలిగిపోయిన అతని మృతదేహం, ఆ పక్కనే పడి ఉన్న అతని వివాహ ఆహ్వన పత్రికలు అందర్ని కంటతడి పెట్టిస్తున్నాయ్.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుడిని వీణవంక మండలానికి చెందిన సంతోష్‌గా గుర్తించారు. అతివేగంతోనే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లె సంతోష్ వివాహం మే 15న జరగాల్సి ఉంది. ఐతే పెళ్లికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బంధువులకు పెళ్లి పత్రికలు పంచేందుకు ఇవాళ ఉదయం ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరి వెళ్లాడు. సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల సమీపంలో బైక్ అదుపుతప్పి ఇసుక ట్రాక్టర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సంతోష్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయాడు. సంతోష్ మరణంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అటు వధువు ఇంట్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
