AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఛీ.. ఛీ మరీ ఇంత దిగజారుడుతనమా.. కట్నం ఇవ్వలేదని పెళ్లి పీటలపై నుంచే పారిపోయిన వరుడు

సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని పెళ్లిపీటలపై నుంచి పెళ్లి కొడుకు పారిపోవడం స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే మనూరు మండలానికి చెందిన యువతి, అలాగే కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకుంటున్నారు.

Telangana: ఛీ.. ఛీ మరీ ఇంత దిగజారుడుతనమా.. కట్నం ఇవ్వలేదని పెళ్లి పీటలపై నుంచే పారిపోయిన వరుడు
Marriage
Aravind B
|

Updated on: May 27, 2023 | 8:02 PM

Share

సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని పెళ్లిపీటలపై నుంచి పెళ్లి కొడుకు పారిపోవడం స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే మనూరు మండలానికి చెందిన యువతి, అలాగే కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకుంటున్నారు.కానీ అతనికి తమ కూతురుని ఇచ్చేందుకు యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మరో విషయం ఏంంటే ఈ ఏడాది జనవరిలోనే కంగ్టి మండలానికి చెందిన మరో యువకుడితో ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు అతనికి ఫోన్‌ చేసి… తాను ఆమెను ప్రేమిస్తున్నానని, వదిలేయాలంటూ బెదిరించాడు. దీంతో అతను పెళ్లికి నిరాకరించాడు. చివరికి ప్రేమికులిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి.

శుక్రవారం రోజున కొండాపూర్ మండలంలోని ఓ గుడిలో వివాహానికి సర్వం సిద్ధం చేశారు. ఇక పెళ్లి రోజున అంతా సక్రమంగా సాగుతున్న క్రమంలో పెళ్లి కొడుకు కట్నం చాలలేదంటూ వాగ్వాదానికి దిగాడు. రూ.15 లక్షలు కట్నం ఇస్తేనే తాళి కడతానని పెళ్లి కొడుకు తేల్చిచెప్పాడు. యువతి కుటుంబ సభ్యులు అంత ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని చెప్పినా వినలేదు. చివరికి పెళ్లి పీటలపై నుంచి పరారయ్యాడు. ఆ వరుడి కోసం బంధుమిత్రులు ఎంత వెతికినా, ఫోన్ చేసినప్పటికీ అతని జాడ కనిపించలేదు. ఇక చేసేదేమి లేక బాధిత వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్