Viral News: ఇదో జంబలకిడి పంబ.. కట్నం చాల్లేదని వివాహానికి నో చెప్పిన వధువు..
పీటల మీదికి వచ్చిన పెళ్లి ఆగిపోవడం లాంటి సంఘటనలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. అయితే ఇలా పెళ్లిల్లు ఆగిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధానమైంది వరకట్నం. చాలినంత కట్నం ఇవ్వలేదనో, ఒప్పుకున్నంత కట్నం ఇవ్వలేదనో పెళ్లిళ్లు..

పీటల మీదికి వచ్చిన పెళ్లి ఆగిపోవడం లాంటి సంఘటనలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. అయితే ఇలా పెళ్లిల్లు ఆగిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధానమైంది వరకట్నం. చాలినంత కట్నం ఇవ్వలేదనో, ఒప్పుకున్నంత కట్నం ఇవ్వలేదనో పెళ్లిళ్లు ఆగిపోవడం చూసి ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో సహజంగానే వరుడి తరపు బంధువులే పెళ్లికి నిరాకరిస్తుంటారు. అయితే తాజాగా హైదరాబాద్ మేడ్చల్‌లో దీనికి భిన్నంగా జరిగింది. కట్నం సరిపోలేదని వధుడు పెళ్లికి నిరాకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అసలేం విషయం ఏంటంటే.. మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన యువకుడికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట కు చెందిన యువతితో పెద్దలు వివాహాన్ని నిశ్చయించారు. రివర్స్‌లో అమ్మాయికే రెండు లక్షల రూపాయలు కట్నం ఇచ్చేందుకు అబ్బాయి తరఫు వారు అంగీకరించారు. అనుకున్నదే తడవుగా అమ్మాయికి కట్నం డబ్బలు ఇచ్చేశారు. ఇంకేముంది ముహుర్త సమయం రానే వచ్చేసింది. వరుడుతో పాటు, వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు.
గురువారం రాత్రి వివాహం జరగాల్సిఉంది. అయితే పెళ్లికి మరో గంట సమయం ఉండగా వధువు ఊహించిని బాంబు పేల్చింది. వరుడు కుటుంబం ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనపు కట్నం ఇస్తే పెళ్లి పీటల మీద కూర్చుంటానంటూ తేల్చి చెప్పింది. దీంతో దీక్కు తోచని వరుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు వర్గాల వారిని పిలిచి మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి కోసం ఇచ్చిన రెండు లక్షల రూపాయలు కూడా వదిలేసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
