AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఛీ ఛీ.. వీడు మనిషేనా.. ప్రేమకు అడ్డొస్తుందని ప్రియురాలి తల్లిపై ప్రియుడి పైశాచికం..!

తమ ప్రేమకు అడొస్తుందనే కారణంగా ప్రియురాలి తల్లిపై దారుణంగా దాడికి తెగబడ్డాడు ఉన్మాది. గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం సుద్దాలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరుగు పొరుగు వారు అడ్డుకోవడంతో మహిళ ప్రాణాలు దక్కాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Telangana: ఛీ ఛీ.. వీడు మనిషేనా.. ప్రేమకు అడ్డొస్తుందని ప్రియురాలి తల్లిపై ప్రియుడి పైశాచికం..!
Murder Attempt
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 02, 2025 | 5:26 PM

Share

ప్రేమ పెళ్ళికి ప్రియురాలి తల్లి అడ్డు వస్తుందని ప్రియుడు దాడికి తెగబడ్డాడు. అందరూ చూస్తుండగానే ఆమె చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇరుగు పొరుగు వారి ముందే ఆమె గొంతు నులిమి చంపబోయాడు. చివరికి స్థానికులు బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ శాడిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం సుద్దాలపల్లె గ్రామంలో తమ ప్రేమకు అడ్డొస్తుందని ప్రియురాలు తల్లి చామంతి ప్రేమోన్మాది గొంతు నులిమి హత్య చేయడానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకన్న పోలీసులు రిమాండ్‌కు పంపారు. సుద్దాలపల్లె గ్రామానికి చెందిన ఓ యువతికి.. అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం గమనించిన తల్లి చామంతి కూతురును మందలించింది. ఇంకోసారి ఫోన్ మాట్లాడవద్దని హెచ్చరించింది.

యువతి తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. కుటుంబ పరిస్థితిని తన కూతురు వివరించి మనసు మార్చేందుకు ప్రయత్నించింది తల్లి. దీంతో ఇంట్లో కుదిర్చిన వివాహానికి ఒప్పుకుంది. మార్చి నెలలోనే మరొకరితో పెళ్లికి సిద్ధమై, వర పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబసభ్యులు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ తమ ప్రేమకు అడ్డు వస్తుందనే నెపంతో చామంతిని హత్య చేయాలని భావించాడు. బహిరంగంగానే అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా కొట్టి గొంతు నులిమి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రాజ్ కుమార్ ఇరుగుపొరుగు చూసి అడ్డుకోవడంతో బాధితురాలు బతికి బయటపడింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిని పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వి శేఖర్ తెలిపారు. మహిళపై దాడికి దిగిన వ్యక్తిని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం చామంతి కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి.. 

హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ