AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వామ్మో.. పుష్ప స్టైల్‌నే తలదన్నారుగా..! అడ్డుకున్న పోలీసునే బైక్‌తో ఢీకొట్టిన గంజాయి కేటుగాళ్లు!

మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో గంజాయి రవాణా అడ్డుకునేందుకు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. చెక్ పోస్టు ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకువస్తున్న బైక్‌ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అంతే వేగంగా పోలీస్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పారిపోయారు దుండగులు. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కాలు విరిగి, తీవ్రంగా గాయపడ్డాడు.

Telangana: వామ్మో.. పుష్ప స్టైల్‌నే తలదన్నారుగా..! అడ్డుకున్న పోలీసునే బైక్‌తో ఢీకొట్టిన గంజాయి కేటుగాళ్లు!
Police Check Post
N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 02, 2025 | 4:08 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో గంజాయి రవాణా అడ్డుకునేందుకు ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు అయ్యిన భద్రచలం వద్ద పకడ్బందీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్టు వద్ద రాంగ్ రూట్లో వచ్చి..ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారయ్యారు కేటుగాళ్లు.

భద్రాచలం బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్టు వద్ద కానిస్టేబుల్ యోగానంద చారిని డీకొట్టడంతో అతను కింద పడిపోయి తీవ్ర గాయాలు అయ్యాయి. కాలు విరిగిన యోగానందను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గత 20 రోజుల క్రితం ఇదే తరహాలో గంజాయి స్మగ్లర్లు, బైక్‌పై గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇదే చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా, కానిస్టేబుల్ ను ఢీకొట్టి పరారయ్యారు. ఆ సమయంలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా అలాంటి సీన్ రిపీట్ కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

మన్యం నుంచి జిల్లాలోకి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. బ్రిడ్జి సెంటర్ చెక్‌ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు చేస్తున్నారు. వరుస ఘటనలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..