Crime news: ప్రాణం తీసిన పాఠశాల సెలవు.. యంత్రంలో చిక్కుకుని.. కన్నవారి కళ్లెదుటే తెగిపడిన కుమారుడి తల
ఉగాది(Ugadi) పండుగ వారింట విషాదం నింపింది. సంతోషంగా పండుగ చేసుకున్న ఆనందం క్షణకాలమైనా నిలవకుండా చేసింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఇంటి దీపాన్ని క్షణాల్లో ఆర్పివేసింది. పాఠశాలకు సెలవు దినం కావడంతో వారు తల్లిదండ్రులతో
ఉగాది(Ugadi) పండుగ వారింట విషాదం నింపింది. సంతోషంగా పండుగ చేసుకున్న ఆనందం క్షణకాలమైనా నిలవకుండా చేసింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఇంటి దీపాన్ని క్షణాల్లో ఆర్పివేసింది. పాఠశాలకు సెలవు దినం కావడంతో వారు తల్లిదండ్రులతో కలిసి చేను వద్దకు వెళ్లిన చిన్నారి ఊహించని రీతిలో మృతి చెందాడు. దారుణ స్థితిలో, ఒళ్లు గగుర్పొడిచే విధంగా దుర్మరణం పొందాడు. యంత్రంలో చిక్కుకుని కన్నవారి కళ్లెదుటే తల, మొండెం వేరయ్యి తనువు చాలించాడు. ఈ ఘటన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. పండగ చేసుకున్న కాసేపటికే కన్నకొడుకు కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించి నతీరు స్థానికులను కంటతడి పెట్టించింది. నల్గొండ(Nalgonda) జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని గాజీనగర్(Gajee nagar) గ్రామానికి చెందిన జానీ, రాణి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. శనివారం ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటి వద్దే పండుగు చేసుకున్నారు. స్కూల్ కు సెలవు దినం కావడంతో ఇద్దరు కుమారులను పొలానికి తీసుకెళ్లారు.
తల్లిదండ్రులు వేరుశనగ చేనులో మిషన్ తో పల్లీలను వేరు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో తొమ్మిదేళ్ల చిన్న కుమారుడు మధు మెడకు చున్నీ చుట్టుకుని ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో ఆడుకుంటూ పల్లి కోత యంత్రం పక్కకు వెళ్లాడు. మధు మెడలోని చున్నీ యంత్రంలో చుట్టుకుని చూస్తుండగానే తల తెగిపడింది. ఈ ఘటనతో హతాశులైన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. వారు రోదించిన తీరు అక్కడున్నవారు తీవ్రంగా కలచివేసింది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read
TS TET 2022: తెలంగాణ టెట్ సిలబస్ మార్పు అనివార్యమా? ఆ నిబంధన ఎత్తివేయకపోతే..