TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌ 2022 సిలబస్‌ కుదింపు! ఏయే విభాగాల్లో ఏమేమి తొలగించారంటే..

ఈసారి తెలంగాణ‌ ఐసెట్‌ 2022 సిలబస్‌ను తగ్గిస్తూ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా Section-Bలోని mathematical ability లోని (75) మార్కుల విభాగంలో..

TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌ 2022 సిలబస్‌ కుదింపు! ఏయే విభాగాల్లో ఏమేమి తొలగించారంటే..
Ts Icet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 03, 2022 | 9:13 AM

TS ICET Exam Dates 2022: ఈసారి తెలంగాణ‌ ఐసెట్‌ 2022 సిలబస్‌ను తగ్గిస్తూ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా Section-Bలోని mathematical ability లోని (75) మార్కుల విభాగంలో పలు అంశాలను తొలగించారు. స్టాటిస్టికల్‌ ఎబిలిటీ విభాగంలో మూడు అంశాలు, ఇంకా ఆల్జీబ్రియల్‌ అండ్‌ జియోమెట్రికల్‌ ఎబిలిటీలో కూడా సిలబస్‌ను కుదించారు. ఐసెట్‌ పరీక్ష మార్కులు మొత్తం 200. అందులో అనలిటికల్‌ ఎబిలిటీకి 75, గణితానికి 75, కమ్యూనికేషన్‌ ఎబిలిటీకి 50 మార్కులు కేటాయించారు. గతంలో ఏ విభాగం నుంచి ఎన్ని మార్కుల ప్రశ్నలు ఇస్తారో మాత్రమే వెల్లడించేవారు. ఈ ఏడాది పాఠ్యప్రణాళికలో ఏ విభాగంలో ఏ అంశం నుంచి ఎన్ని ప్రశ్నలు ఇస్తారో కూడా వెల్లడించారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐసెట్‌ 2022 నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది. ఈ మేరకు కాకయతీ యూనివర్సిటీ (Kakatiya University) విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 6 నుంచి జూన్‌ 27 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెల్పింది. రూ.250ల ఆలస్య రుసుముతో జులై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500ల ఆలస్య రుసుముతో జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1000ల ఆలస్య రుసుముతో జులై 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా జులై 27, 28 తేదీల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన ఫలితాలు ఆగస్టు 22న విడుదలౌతాయి. ఐసెట్‌ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ఈ ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యా మండలి (TSCHE) నిర్వహిస్తోంది.

తెలంగాణ ఐసెట్‌ 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ కింది అర్హతలుండాలి..

  • మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) కోర్సులో ప్రవేశం పొందగోరే విద్యార్ధులు కనీసం 3 సంవత్సరాల వ్యవధి కలిగిన బ్యాచిలర్ డిగ్రీ (బీఏ/ బీకాం/బీఎస్సీ/బీబీఏ/బీబీఎం/బీసీఏ/బీఈ/బీటెక్‌/ బీఫార్మసీ/ లేదా తత్సమాన కోర్సుల్లో (ఓరియంటల్ భాషల్లో డిగ్రీ మినహా) ఉత్తీర్ణులై ఉండాలి.
  • మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సులో ప్రవేశం పొందగోరే విద్యార్ధులు బీసీఏ/ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ /బీఎస్సీ/బీకాం/మాథ్స్‌లో బీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Also Read:

TS TET 2022: తెలంగాణ టెట్ సిల‌బ‌స్‌ మార్పు అనివార్యమా? ఆ నిబంధన ఎత్తివేయకపోతే..