TS LAWCET 2022: తెలంగాణ లాసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల! ముఖ్యమైన తేదీలివే..

తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 3, 5 ఏళ్ల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET- 2022) నోటిఫికేషన్ విడుదలైంది..

TS LAWCET 2022: తెలంగాణ లాసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల! ముఖ్యమైన తేదీలివే..
Ts Lawcet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 03, 2022 | 9:48 AM

TS LAWCET- 2022 Notification: తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 3, 5 ఏళ్ల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET- 2022), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TSPGLCET-2022) ఎల్‌ఎల్‌బీతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LL.M) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌ నోటిఫికేషన్‌ శనివారం (ఏప్రిల్‌ 2) విడుదలైంది. ఈ మేరకు విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 6 నుంచి జూన్‌ 6 వరకు కొనసాగుతుంది. ఎల్‌ఎల్‌బీకి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.1000లు దరఖాస్తు ఫీజు నిర్ణయించారు. రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఆలస్య రుసుంతో జులై 12 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. పరీక్షలు కూడా అదేనెల (జున్‌) 21, 22 తేదీల్లో జరగనున్నాయి. ఎల్‌ఎల్‌బీలో ప్రవేశానికి డిగ్రీ లేదా ఇంటర్‌లో జనరల్, బీసీ, ఎస్సీ/ఎస్టీలకు వరుసగా 45, 42, 40 శాతం అర్హత మార్కులు తప్పనిసరిగా ఉండాలి.

తెలంగాణ లా సెట్‌ 2022 నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

Also Read:

TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌ 2022 సిలబస్‌ కుదింపు! ఏయే విభాగాల్లో ఏమేమి తొలగించారంటే..