BJP Praja Sangrama Yatra: సీఎం ఎవరైనా మొదటి సంతకం దానిపైనే.. బండి సంజయ్ కీలక ప్రకటన..!
BJP Praja Sangrama Yatra: టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
BJP Praja Sangrama Yatra: టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. హుస్నాబాద్‌లో ఇవాళ జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ప్రసంగించిన ఆయన.. టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఇదే చివరి పోరాటం కావాలని బీజేపీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. డబుల్ బెడ్‌రూమ్‌ల విషయంలో తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరైనా మొదటి సంతకం ఉచిత విద్య, వైద్యం పైనే ఉంటుందని బండి సంజయ్ ప్రకటించారు.
ధరణి పోర్టల్ వల్ల తెలంగాణలో ప్రజలు, రైతులుు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయకుండా సర్పంచ్‌లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. తెలంగాణలో పూర్తయిన ప్రాజెక్టుల వల్ల రైతుల పంటపొలాలకి నీళ్లు రావడం లేదని, ఈ ప్రాజెక్టులు ఎవరి స్వలాభం కోసం కడుతున్నారని ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉన్న భూములను లాక్కుంటుందని ఆరోపించారు.
ఇదే సమయంలో హుజురాబాద్ ఉప ఎన్నికపైనా బండి సంజయ్ స్పందించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఎన్నికతోనే రాష్ట్రంలో మార్పు మొదలవబోతోందని వ్యాఖ్యానించారు. కాగా, హుస్నాబాద్ సభకు హాజరైన పార్టీ శ్రేణులను చూసి బండి సంజయ్ ఆశ్చర్యపోయారు. ‘మీ జోష్ చూస్తుంటే 2023లో అధికారం బీజేపీదే అని అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ బాక్స్‌లు బద్దలే.’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also read:
Chay-Sam: దాంపత్య జీవితానికే ఎండ్ కార్డు.. స్నేహ బంధానికి కాదు.. క్లారిటీ ఇచ్చేశారు