Telangana Corona: తెలంగాణ వ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా 201మందికి పాజిటివ్, ఒకరు మృతి
TS Corona: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు తక్కువ.. మరో రోజు ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య దిగివచ్చింది.
Telangana Coronavirus Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు తక్కువ.. మరో రోజు ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య దిగివచ్చింది. గడిచిన 24గంటల వ్యవధిలో కొత్తగా 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,384కు చేరుకుంది. కాగా, తాజాగా ఒకరు వైరస్ బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,920కు చేరింది. ఇక రోజు వ్యవధిలో 258 మంది కరోనా మహామ్మారి బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 6,57,923 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,541 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజే 41,690 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,64,67,418 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసిన తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గడిచిన 24గంటల్లో కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే 68 కేసులు రికార్డయ్యాయి.
జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి…