Trs vs Bjp: ఎంపీ అరవింద్‌పై దాడి.. ఖలిస్తాన్‌ తీవ్రవాదులతో టీఆర్ఎస్‌కు లింక్ అంటూ బండి సంజయ్ సంచలన కామెంట్స్..

Trs vs Bjp: నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్‌పై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.

Trs vs Bjp: ఎంపీ అరవింద్‌పై దాడి.. ఖలిస్తాన్‌ తీవ్రవాదులతో టీఆర్ఎస్‌కు లింక్ అంటూ బండి సంజయ్ సంచలన కామెంట్స్..
Bandi Sanjay
Follow us

|

Updated on: Jan 27, 2022 | 9:02 PM

Trs vs Bjp: నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్‌పై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఎందుకు దాడులు చేస్తు్న్నారో అర్థం కావడం లేదని సందేహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌లో భయం మొదలైందని, ఆ కారణంగానే దాడులకు తెగబడుతున్నారని సంజయ్ ఆరోపించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీకి, ఖలిస్తాన్ ఉగ్రవాదులకు లింక్ ఉందేమో అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీ అరవింద్‌పై దాడి నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 14 వందల మంది అమరుల త్యాగం తెలంగాణ అని అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేరలేదని దాడులు చేయమంటారా? అని టీఆర్ఎస్ నేతలను బండి సంజయ్ ప్రశ్నించారు.

ప్రశ్నిస్తే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని, సీఎం కేసీఆరే స్వయంగా దాడులను ప్రోత్సహిస్తు్న్నారని బండి సంజయ్ ఆరోపించారు. తమ సహనాన్ని పిరికితనంగా భావిస్తే.. తాము కూడా అలాగే సమాధానం చెబుతామని హెచ్చరించారు సంజయ్. ముఖ్యమంత్రి ఎం త్యాగం చేశారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

సీఎంఓ ఆదేశాల మేరకే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే దాడులు మొదలు పెట్టారని అన్నారు. దాడులు తప్ప సీఎం ఏమీ చేయలేరన్నారు. దాడులను ఎదుర్కొనేందుకు తాముు సిద్ధంగా ఉన్నామన్నారు. తాము దాడులు చేయడం మొదలు పెడితే రాష్ట్రంలో ఉండలేరంటూ టీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారని, తెలంగాణ బిల్లు ఓటింగ్ సమయంలో ఎంపీగా ఉన్న కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు బండి సంజయ్.

3వ తేదీన ఈ దాడులపై ప్రివిలేజ్ కమిటీ తేలుస్తదని, ప్రస్తుతం జరిగిన దాడిని కూడా ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని బండి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేయలేక చాలా మంది ఐపీఎస్‌లు బాధపడుతున్నారని పేర్కొన్నారు. దాడి విషయం సీపీ, డీజీపీకి ముందే తెలుసునని అన్నారు. నిజామాబాద్ సిపి , డిజిపి డైరెక్షన్‌లో జరిగిన హత్యాయత్నం ఇది అని, దీనిపై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు.

రైతుల దాడి.. ఖలిస్థాన్ ఉగ్రవాదులతో టీఆర్ఎస్‌కు లింక్? ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీకి ఖలిస్తాన్‌ తీవ్రవాదులతో లింక్ ఉందేమో అంటూ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఖలిస్థాన్ ఉగ్రవాదులకు సంబంధాలున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీని అడ్డుకుంది రైతులు అన్నారని, ఆ తరువాత తామే అడ్డుకున్నామని ఖలిస్తాన్ తీవ్రవాదులు ప్రకటించారని ఉటంకించారు. నిజామాబాద్‌లోనూ రైతులు దాడి చేశారని టీఆర్ఎస్ చెబుతోంది.. కానీ తెలంగాణ రైతులు ఎవరు కూడా కర్రలు, కత్తులతో దాడులు చేయరన్నారు. ఈ దాడులను బట్టి చూస్తుంటే టీఆర్ఎస్ కూడా ఖలిస్తాన్ లాంటి సంస్థని వెంటబెట్టుకుని తిరుగుతుందా? అనే అనుమానం కలుగుతోందని బండి సంజయ్ తీవ్రమైన కామెంట్స్ చేశారు.

Also read:

Powergrid Jobs: గుడ్‌న్యూస్! నేరుగా ఇంటర్వ్యూతోనే 105 పవర్ గ్రిడ్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు ఇవే..

Budget 2022: అప్పలిచ్చేందుకు ప్రభుత్వాలు వెనుకాడకూడదు.. బడ్జెట్ 2022 కుర్పుపై ప్రొఫెసర్ జోసెఫ్ విశ్లేషణ..

Election 2022: పొత్తు రాజకీయాల్లో కాంగ్రెస్ చిత్తు.. వ్యూహాలతో దూసుకెళ్తున్న బీజేపీ..