AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫ్రస్టేషన్‌తోనే దాడులకు తెగబడుతున్నారు.. టీఆర్‌ఎస్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో ప్రజలు అధికారం నుంచి తరమికొడతారనే ఫ్రస్టేషన్‌తోనే టీఆర్‌ఎస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. ఈరోజు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసానికి వెళ్లి..వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి పూర్వాపరాలను..

Telangana: ఫ్రస్టేషన్‌తోనే దాడులకు తెగబడుతున్నారు.. టీఆర్‌ఎస్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay
Amarnadh Daneti
|

Updated on: Nov 19, 2022 | 3:55 PM

Share

వచ్చే ఎన్నికల్లో ప్రజలు అధికారం నుంచి తరమికొడతారనే ఫ్రస్టేషన్‌తోనే టీఆర్‌ఎస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. ఈరోజు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసానికి వెళ్లి..వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ గుండాల దాడులను ఖండిస్తున్నామన్నారు. దాడులు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. అరవింద్ బూతులేమీ మాట్లాడలేదని, వాస్తవాలను ప్రజల ముందుంచారని తెలిపారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని అడిగారు. అరవింద్ అమ్మానాన్నలు పెద్దవాళ్ళని, నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారని, మంచానికే పరిమితమయ్యారన్నారు. అద్రుష్టవశాత్తు ఆయన దాడి సమయంలో ఇంట్లో లేరని, ఒకవేళ ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు బండి సంజయ్. ఎంపీ అరవింద్ నివాసంలో ఉన్న మహిళలపై టీఆర్ఎస్ గూండాలు రాళ్లు విసరడం అందరూ చూశారని, మహిళల గురించి మాట్లాడే టీఆర్ఎస్ నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారన్నారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువైందని, బీజేపీ చేతిలో ఓటమి ఖాయమనే క్రోమా ఫోబియా పట్టుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడులు, ప్రెస్ మీట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు ఏదో డ్రామా చేద్దామనుకున్నారని, జనం నమ్మలేదని, డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్లుగా పరిస్థితి తయారైందని బండి సంజయ్ విమర్శించారు. ధర్మపురి అరవింద్ మాట్లాడితే.. వాళ్ల కుటుంబ సభ్యులపై, నివాసంపై దాడి చేయడమేంటని, వాళ్లకు ఏం సంబందమని ప్రశ్నించారు. రాష్టం లో శాంతి భద్రత లు క్షీణించాయణదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అడిగారు. పైగా ఊరికించి కొడతామని అంటున్నరు.. రాష్ట్ర ప్రజలే టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్ కుటుంబాన్ని ఉరికించి ఉరికించి తెలంగాణ పొలిమేరలు దాటించి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

అరవింద్ నివాసంపై దాడి ఘటనకు పోలీసులే బాధ్యులని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు పోలీసులు పింక్ డ్రెస్ వేసుకుని టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారని, ఇది క్షమించరాని విషయమన్నారు. టీఆర్ఎస్ నేతల్లో ఫ్రస్టేషన్ ఎక్కవైందని, కేసీఆర్ కుటుంబంలో అంత:పుర కలహాలు స్టార్ట్ అయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా, కుటుంబ పెద్దగా, తండ్రి గా ఫెయిల్ అయ్యారని, ప్రజల ద్రుష్టి మళ్లించేందుకే దాడులతో డ్రామాలు చేస్తున్నారన్నారు.

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనను తాను, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె.అరుణ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామన్నారు. అమిత్ షా అరవింద్ తో ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చారని తెలిపారు. బీజేపీలో చేరాలంటూ ఫోన్ చేశారంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేసీఆర్ నే పట్టించుకోలేదు.. ఆయన కుమార్తెను ఎవరు పట్టించుకుంటారని అన్నారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నోటీసులపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమకు నోటీసులు కొత్తకాదని, నోటీసులొస్తే వాళ్లలెక్క పట్టీలు వేసుకోబోమన్నారు. వీల్ చైర్ లో కోర్చోబోమని, బరాబర్ తీసుకుంటామన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని, డబుల్ బెడ్రూం ఇళ్లు, రుణమాఫీ సహా ఏ సమస్యలపై సీఏం స్పందించడంలేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

Follow Us