AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా రక్షణ శాఖలో సంక్షోభం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..!

ఇరాన్‌తో యుద్ధ వాతావరణం, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా రక్షణ శాఖలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. యూఎస్ నేవీ సెక్రటరీ జాన్ సి. ఫెలాన్‌ను ట్రంప్ ప్రభుత్వం తక్షణమే పదవి నుండి తొలగించింది. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అమెరికా రక్షణ శాఖలో సంక్షోభం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..!
Donald Trump On Navy Chief
Balaraju Goud
|

Updated on: Apr 23, 2026 | 8:45 AM

Share

ఇరాన్‌తో యుద్ధ వాతావరణం, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా రక్షణ శాఖలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. యూఎస్ నేవీ సెక్రటరీ జాన్ సి. ఫెలాన్‌ను ట్రంప్ ప్రభుత్వం తక్షణమే పదవి నుండి తొలగించింది. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ బుధవారం (ఏప్రిల్ 23, 2026) అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఫెలాన్ సేవలకు ధన్యవాదాలు తెలిపారు.

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఉప మంత్రి స్టీఫెన్ ఫెయిన్‌బర్గ్‌లతో నెలల తరబడి కొనసాగుతున్న విభేదాలే ఫెలాన్ ఉద్వాసనకు ప్రధాన కారణం. ప్రధానంగా మూడు అంశాలపై వీరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సిబ్బంది నియామకాలు, విధానపరమైన నిర్ణయాల్లో ఫెలాన్ ఒంటెత్తు పోకడలు అవలంబిస్తున్నారని పెంటగాన్ అగ్ర నాయకత్వం భావించింది. సంక్షోభంలో ఉన్న నౌకాదళ నిర్మాణ ప్రాజెక్టులను మెరుగుపరిచే విషయంలో అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్త యుద్ధనౌకలు, “ట్రంప్-క్లాస్” విమాన వాహక నౌకలతో కూడిన అత్యంత ఖరీదైన ‘గోల్డెన్ ఫ్లీట్’ ప్రాజెక్టును ఫెలాన్ గట్టిగా సమర్థించారు. అయితే, దీని నిర్వహణపై అసంతృప్తితో ఉన్న ఫెయిన్‌బర్గ్, ప్రాజెక్టు బాధ్యతలను ఫెలాన్ నుండి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ఫెలాన్‌కు తన డిప్యూటీ, అండర్ సెక్రటరీ హంగ్ కావోతో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. సామాజిక, సాంస్కృతిక అంశాలపై కావో, హెగ్సెత్‌కు సన్నిహితంగా ఉండటం ఫెలాన్‌కు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఫెలాన్ స్థానంలో కావో బాధ్యతలు చేపట్టనున్నారు.

ట్రంప్ ప్రభుత్వంలో రక్షణ శాఖ అధికారుల తొలగింపు ఇది మొదటిదేమీ కాదు. సుమారు 20 రోజుల క్రితమే ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను పీట్ హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. నాలుగేళ్ల పదవీకాలం ముగియకముందే ఆయనను పంపించివేయడం సంచలనం సృష్టించింది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉన్న తరుణంలో, నేవీ చీఫ్‌ను కూడా మార్చడం అమెరికా యుద్ధ వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us