Huzurabad By Election: హుజురాబాద్ బీజేపీ మ్యానిఫెస్టోలో నియోజకవర్గ ప్రజలకి బంపరాఫర్లు

తెలంగాణలోని ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ హుజురాబాద్ నియోజకవర్గ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో నియోజయవర్గ ప్రజలకు పలు ఆఫర్లను

Huzurabad By Election: హుజురాబాద్ బీజేపీ మ్యానిఫెస్టోలో నియోజకవర్గ ప్రజలకి బంపరాఫర్లు
Huzurabad Manifesto


BJP Huzurabad Manifesto: తెలంగాణలోని ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ హుజురాబాద్ నియోజకవర్గ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో నియోజయవర్గ ప్రజలకు పలు ఆఫర్లను ప్రకటించింది బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ ఇవాళ సదరు మ్యానిఫెస్టో విడుదల చేసారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని రైల్వే స్టేషన్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారాయన. అలాగే అవసరమున్నచోట ఆర్వోబీల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు.

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో 60ఏళ్ల పైబడిన రైతులకు రూ.3వేల పెన్షన్ అందజేస్తామని.. అర్హులైన విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి విద్యాలక్ష్మి పథకం ద్వారా సహాయం అందజేస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. బేటీ బచావో, బేటీ పడావో, ఆయుష్మాన్ భారత్ పటిష్ట అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు రక్షిత మంచి నీరు అందిస్తామని బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడించారు.

అంతేకాదు, హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ పక్కాగా అమలు చేస్తామని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది.   నియోజకవర్గ పరిధిలో 60ఏళ్ల పైబడిన రైతులకు రూ.3వేల పెన్షన్ అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రైతులకు పెన్షన్ అందించే పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అలాగే అర్హులైన విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి విద్యాలక్ష్మి పథకం ద్వారా సహాయం చేయడం.. బేటీ బచావో, బేటీ పడావో, ఆయుష్మాన్ భారత్ పటిష్ట అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా, ఇవాళ హుజూరాబాద్‌లో నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని.. ఆపే అధికారం లేదని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కమలాపూర్‌ దళిత కాలనీలో.. ఆయన ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ప్రజలను ప్రేమతో ఓట్లు అడగాల్సింది పోయి.. టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని.. ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ఈటల ఆరోపించారు.

” నేను ఉండగా పింఛన్ పోదు, కార్డు పోదు. దళిత బంధు పోదు. చేనేత కార్మికుల హక్కులు పోవు. ఏవీ పోవు. అన్నిటికి బాధ్యత నాదే. రఘునందన్ గెలిసిండు. పోయినయా అక్కడ? ఇక్కడ ఎంపీగా బండి సంజయ్ గెలిసిండు… పోయినయా? అన్ని ఒట్టి మాటలే. దాన్ని నమ్ముతారా?. అంత అమాయకులా? కేసీఆర్ ఇంట్లో నుంచి ఇస్తున్నారా? అని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.

Huzurabad Bjp

Read also: Telangana TMC: అసంతృప్తులకు తృణమూల్ గాలం.. తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయా..?

Click on your DTH Provider to Add TV9 Telugu