హనుమాన్ భక్తులకు భిక్ష.. పూజ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ట్రోల్స్‌తో బీజేపీ రియాక్షన్..!
వ్యక్తిగత నమ్మకాలు వేరు.. ప్రజా సమూహంలో.. అందులోనూ, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల విశ్వాసాలను గుర్తించడం వేరు. దేవుడిని నమ్మడం నమ్మకపోవడం.. విపరీతంగా పూజించడం.. దాన్నే చర్చకు పెట్టడం ఇవన్నీ ఇవాళ రాజకీయాల్లో భాగమైపోయాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరయ్యారు. హనుమాన్ దీక్షాపరులతో కలిసి భిక్షలో పాల్గొని వారితో సహపంక్తి భోజనం చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హనుమాన్ భక్తులకు భిక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనే.. స్వయంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఇటు భక్తితో పాటు అటు రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చ సాగుతుంది.
వ్యక్తిగత నమ్మకాలు వేరు.. ప్రజా సమూహంలో.. అందులోనూ, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల విశ్వాసాలను గుర్తించడం వేరు. దేవుడిని నమ్మడం నమ్మకపోవడం.. విపరీతంగా పూజించడం.. దాన్నే చర్చకు పెట్టడం ఇవన్నీ ఇవాళ రాజకీయాల్లో భాగమైపోయాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరయ్యారు. హనుమాన్ దీక్షాపరులతో కలిసి భిక్షలో పాల్గొని వారితో సహపంక్తి భోజనం చేశారు.
దాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా వాడుతోంది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తోంది. ఎవరైనా పిల్లలు జైశ్రీరామ్ అంటే వారికి కూడా సంజాయించాలే.. జైశ్రీరాం అన్న నినాదం కడుపు నింపదు అంటూ గతంలో ఏదో సందర్భంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ తోపాటు.. మరికొన్ని అంశాల సమాహారంగా ఓ వీడియోను కమెడియన్స్ మీమ్స్ తో కలిపి తయారుచేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది.
క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా ఉన్న కేటీఆర్.. గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్నీ తానై నడిపిస్తున్నారు. ఈక్రమంలో తన వ్యక్తిగత అభిప్రాయాలు, విశ్వాసాల మాటెలా ఉన్నా.. సమాజంలోని వివిధ వర్గాల వారి సెంటిమెంట్స్‌ను, నమ్మకాలని గౌరవించాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ఒక నాయకుడిగా హనుమాన్ దీక్షాపరుల ఆహ్వానం మేరకు కేటీఆర్ సిరిసిల్లలో వారి భిక్షా కార్యక్రమానికి హాజరై సహపంక్తి భోజనం చేశారు. అయితే..ఈ కార్యక్రమం లో కేటీఆర్ పాల్గొనడంపై బీజేపీ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తుంది. గతంలో కవిత కూడా కొండగట్టు అంజన్న దగ్గరకు తరచూ వెళ్లినప్పుడు ఇలాంటి ప్రచారాలే జరిగాయి. ఇప్పుడు కేటీఆర్ వంతైంది.
మొత్తంగా దేవుడి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ ట్రోల్ సంగతి పక్కకు పెడితే. రాజకీయ చర్చకు దారి తీసింది. ఇటీవల ఉత్తర తెలంగాణలో బీజేపీ వేగంగా పుంజుకుంది. గతంలో ఇక్కడ బీఆర్ఎస్‌కు గట్టి బలం ఉండేది. అయితే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పైచేయిగా నిలిచింది. ఈ ప్రాంతంలో హిందూత్వ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతం లో అధికంగా భక్తులు హనుమాన్ మాల వేసుకుంటారు భక్తులు. ప్రతి గ్రామంలో హనుమాన్ భక్తులు ఉంటారు. ముఖ్యంగా బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్. హనుమాన్ భక్తుల అంశం మాట్లాడారు.
సహజంగానే బీజేపీ హిందుత్వ ఏజెండా ను నమ్ముతుంది. హనుమాన్ జయంతి సందర్బంగా.. బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించింది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిల్లో బీజేపీకి చెక్ పెట్టాలంటే.. మనం కూడా జై హనుమాన్, జై శ్రీరామ్ అనలానే చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో సాగుతుంది. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకున్నా దేవుడు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. హనుమాన్ భక్తుల చుట్టూ నాయకులు తిరుగుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..