BJP: మా తుది శ్వాస వరకూ బీజేపీలోనే ఉంటాం.. పార్టీ మారుతున్నట్లుగా వస్తున్నవి రూమర్స్.. ఆ ఇద్దరు నేతల వివరణ..
గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి మారిన సీహెచ్ విఠల్.. తిరిగి కారు ఎక్కబోతున్నట్లుగా ప్రచారం సాగింది. దీంతో అది తప్పుడు ప్రచారం అంటూ స్పష్టం చేశారు.

మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు నడుస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌తో బైపోల్ హీట్ మరింత పెరిగింది. ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో చేరతారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి కొందరు బీజేపీలోకి జంప్ కాగా.. ఇప్పుడు తాజా గులాబీ పార్టీ నుంచి కమలం పార్టీలో మారిపోయారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి మారిన సీహెచ్ విఠల్.. తిరిగి కారు ఎక్కబోతున్నట్లుగా ప్రచారం సాగింది. దీంతో అది తప్పుడు ప్రచారం అంటూ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇది పూర్తిగా తప్పుడు వార్త. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి అంటూ విఠల్ కోరారు. తాను నైతిక రాజకీయ విలువలకు కట్టుబడి ఉన్నానని.. నైతిక విలువలతో బీజేపీలో చేరినట్లుగా వెల్లడించారు. ఎవరూ తనను కొనుగోలు చేయలేరని.. తన చివరి శ్వాస వరకూ బీజేపీలోనే ఉంటానంటూ విఠల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే గతంలో 2014 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఉన్న విఠల్.. 2021 డిసెంబర్లో బీజేపీలో చేరారు.
బీజేపీలోనే ఉంటాను – ఏనుగు రవీందర్ రెడ్డి
తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు బీజేపీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి . బీజేపీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్తున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాను బీజేపీలోనే ఉంటానని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్, కేటీఆర్.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లో ఉద్యమ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఒక్కొక్కరిని పార్టీ నుంచి వెళ్లగొట్టారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నైతిక విలువలు లేవని తాము గ్రహించే పార్టీని వీడి బీజేపీలో చేరామన్నారు.
పార్టీ మార్పుపై ఏనుగు రవీందర్ రెడ్డి రియాక్షన్ ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
