Telangana: BJP నుంచి TRS లోకి దాసోజు శ్రావణ్.. పవన్ కల్యాణ్ నుంచి ఊహించని ట్వీట్
పార్టీ మారిన నేతలను చాలా మంది తప్పుబడుతూ ఉంటారు. వారిపై విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. పార్టీ మారే నేతలు ప్రశంసలందుకోవడం చాలా అరుదు. అలాంటి విచిత్రమైన సంఘటన తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంది.

ఒక పొలిటికల్ లీడర్ ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నారంటే సహజంగా ప్రశంసల కంటే విమర్శలు ఎక్కువొస్తాయి. ఇటీవలే కాషాయ కండువా కప్పుకున్న దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి బైబై చెప్పారు. పార్టీలు మారే నేతలంటే సాధారణంగానే చిన్నచూపు ఉంటుంది. కాని శ్రవణ్ మాత్రం ప్రశంసలందుకున్నారు. ఆ ప్రశంసించిన వ్యక్తి కూడా తెలంగాణకు చెందిన నాయకుడు కాదు. శ్రవణ్‌ను ప్రశంసించింది ఎవరో కాదు జనసే అధినేత పవన్ కల్యాణ్. శ్రవణ్ డైనమిక్, విజనరీ లీడర్ అంటూ అభినందనలు తెలిపారు. నా ప్రియమైన మిత్రుడు శ్రవణ్ అంటూ పవన్ రెండు ట్వీట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం PRP నుంచి శ్రవణ్ TRSలో చేరారని గుర్తు చేశారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధి కోసం పోరాటం చేస్తారని అన్నారు. ఆయన నిజమైన శక్తిసామర్ధ్యాలను ప్రతీ ఒక్కరి ఇప్పటికైనా గుర్తిస్తారని ఆశించారు. భవిష్యత్ ప్రయత్నాల్లో శ్రవణ్ విజయం సాధించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
VO: AICC అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ సరిగ్గా రెండున్నర నెలల క్రితమే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఇప్పుడు సరిగ్గా సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు ముహుర్తం చూసుకొని ఎనిమిది సంవత్సరాల ఏడు నెలలకు మళ్లీ సొంత గూటికి చేరారు.
Hope everyone will realise now his true potential. I wish my dear friend Sravan @sravandasoju all the best in his future endeavours. – JanaSena Chief Sri @PawanKalyan (2/2)
— JanaSena Party (@JanaSenaParty) October 21, 2022
బీజేపీపై శ్రవణ్ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పుడు రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దాసోజు. ఇప్పుడు బీజేపీపైనా విమర్శలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అనిశ్చితమైన, దశ, దిశా లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని చెప్పిన బీజేపీ, మునుగోడు ఉప ఎన్నికలో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని వ్యాఖ్యానించారు శ్రవణ్. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా పార్టీలో వ్యవహారం నడుస్తోందని ఆరోపించారు. మందు, మాంసం, విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచి.. మునుగోడు ఎన్నికల్లో గెలుపు సాధించాలనుకుంటున్న బీజేపీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు దాసోజు శ్రవణ్.
మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు నడుస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌తో బైపోల్ హీట్ మరింత పెరిగింది. ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో చేరతారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మునుగోడు పరిధిలో చోటా మోటా నేతలు కండువాలు మార్చేస్తుంటే రాష్ట్ర స్థాయిలోనూ కీలక నేతలు కండువా మార్చేస్తున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయం ఆసక్తిగా సాగుతోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో ఈ గేమ్ మొదలైంది. గులాబీకి గుడ్‌బై చెప్పి బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోవడంతో టీఆర్‌ఎస్ కూడా అలర్ట్ అయింది. పాత నేతలకు టచ్‌లోకి వెళ్లింది. బీజేపీలోకి వెళ్లిన వారిని మళ్లీ చేర్చుకోవడం ద్వారా గట్టి దెబ్బకొట్టాలని ప్లాన్ చూస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..
