Rahul Gandhi: ఉత్త మాటలు చెప్పబోం.. బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

కేసీఆర్ ఇంట్లో తప్ప 24గంటల కరెంట్ ఎక్కడా రావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్‌ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. మణుగూరు కాంగ్రెస్ సభలో, వరంగల్‌జిల్లా నర్సంపేటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక.. ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని.. కేసీఆర్‌లాగా తాము ఉత్త మాటలు చెప్పబోమంటూ స్పష్టంచేశారు.

Rahul Gandhi: ఉత్త మాటలు చెప్పబోం.. బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
Rahul Gandhi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 17, 2023 | 5:12 PM

కేసీఆర్ ఇంట్లో తప్ప 24గంటల కరెంట్ ఎక్కడా రావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్‌ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. మణుగూరు కాంగ్రెస్ సభలో, వరంగల్‌జిల్లా నర్సంపేటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక.. ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని.. కేసీఆర్‌లాగా తాము ఉత్త మాటలు చెప్పబోమంటూ స్పష్టంచేశారు. కాంగ్రెస్ తుఫాన్ వస్తోందని.. కేసీఆర్‌కు అర్థమైందని.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతోందని రాహుల్ పేర్కొన్నారు. బీఆర్ఎస్‌కు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే యుద్ధం జరుగుతోందంటూ రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చే హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి జరిగిందని.. దళితబంధుకు రూ.3 లక్షలు కమీషన్‌ తీసుకుంటున్నారంటూ రాహుల్‌ ఆరోపించారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్‌ ఏం చేసిందని కేసీఆర్‌ అడుగుతున్నారు..కేసీఆర్‌ చదువుకున్న స్కూల్‌, కాలేజీ కాంగ్రెస్‌ ఇచ్చిందేనన్నారు. 500లకే గ్యాస్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తామంటూ హామీనిచ్చారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని.. గృహజ్యోతి కింద 200 మెగావాట్ల ఉచిత కరెంట్.. ఇలా 6 గ్యారంటీలను కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామంటూ స్పష్టంచేశారు.

బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని రాహుల్‌గాంధీ ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తోందని, పార్లమెంట్‌లో బీజేపీకి బీఆర్ఎస్‌ సపోర్ట్‌ చేస్తోందని రాహుల్‌ మండిపడ్డారు. ఎక్కడ కాంగ్రెస్‌ నిలబడుతుందో..అక్కడ ఎంఐఎం బరిలో ఉంటోంది.. ఈ ఎన్నికల్లో పోటీ బీఆర్‌ఎస్‌ – కాంగ్రెస్‌ మధ్యే ఉంది.. అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో కాంగ్రెస్‌ తప్పక విజయం సాధిస్తుంది. ప్రజా తెలంగాణను సాకారం చేస్తామని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

కేసీఆర్‌ ది దొరల పాలన, కాంగ్రెస్‌ ది ప్రజా పాలన.. వెనుకబడిన అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తాం.. సీఎం కేసీఆర్‌ దోచుకున్న వేలకోట్లు మళ్లీ మీ బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తామని.. సీఎం ఫ్యామిలీ దోచుకున్న కోట్ల రూపాయలు బీద ప్రజలకు ఇప్పిస్తామంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా