Telangana: తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..

తెలంగాణలో రైతు రుణమాఫీ మంటలు రాజుకున్నాయి. నారాయణపేట సభలో సీఎం రేవంత్ చేసిన ప్రకటనకు.. ఘాటుగా రియాక్ట్‌ అవుతున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రి రోజుకోమాట మారుస్తున్నారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు.. కాగా.. కాంగ్రెస్ పార్టీ నారాయణపేట సభలో రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Telangana: తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
Telangana Politics
Follow us

|

Updated on: Apr 16, 2024 | 5:14 PM

తెలంగాణలో రైతు రుణమాఫీ మంటలు రాజుకున్నాయి. నారాయణపేట సభలో సీఎం రేవంత్ చేసిన ప్రకటనకు.. ఘాటుగా రియాక్ట్‌ అవుతున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రి రోజుకోమాట మారుస్తున్నారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు.. కాగా.. కాంగ్రెస్ పార్టీ నారాయణపేట సభలో రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. పంద్రాగస్ట్‌లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల కోడ్‌ వల్ల రుణమాఫీ ఆగిందని.. కోడ్‌ ముగియగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని హామీ ఇచ్చారు.

రేవంత్‌ రెడ్డి లేటెస్ట్‌ స్టేట్‌మెంట్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సోనియాగాంధీ పుట్టినరోజుకు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్‌ రెడ్డి మాటమార్చడం దారుణమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌. రైతులను మోసం చేయడానికి మరో పాచిక అంటూ విమర్శించారు.

అటు బీఆర్‌ఎస్‌ నేతలు కూడా సీఎం రేవంత్ ప్రకటనపై ఫైర్‌ అవుతున్నారు. డిసెంబర్‌ 9నాడు మాఫీ చేస్తామన్న సీఎం.. మాటమారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కామెంట్‌ చేశారు గ్యాదరి కిషోర్‌. రుణమాఫీపై మరో డ్రామా ఇది అంటూ గ్యాదరి విమర్శించారు.

రుణమాఫీ చేస్తానన్న రేవంత్‌.. రాహుల్‌ని ప్రధానిని చేస్తేనే అవుతుందనడం దారుణమన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్‌. అక్కడ రాహుల్‌ రారు.. ఇక్కడ రుణమాఫీ కాదంటూ ఈటల విమర్శించారు. రుణమాఫీపై రేవంత్‌ మాటలు మారుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..