Telangana: పిట్ట కొంచెం.. కూత ఘనం..! ఏడేళ్ళకే అద్భుత ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం

సాధారణంగా ఎవరైనా ఒక నాలుగైదు దేశాల రాజధానుల పేర్లు, వాటి కరెన్సీని సులభంగానే గుర్తు పెట్టుకుంటారు. మహా అయితే మనం నిత్యం వినియోగించే పది అంకెల ఫోన్ నెంబర్లను కూడా గుర్తుపెట్టుకుంటాం. ఓ 20 దేశాల పేర్లు వాటి రాజధానులు, ఆయా దేశాల కరెన్సీని గుర్తు పెట్టుకోవాలంటే కాస్త కష్టమే..! కానీ ఏడేళ్ల బుడతడు మాత్రం వంద దేశాలు, వాటి రాజధానుల పేర్లను మాత్రం అవలీలగా చెప్పేస్తున్నాడు.

Telangana: పిట్ట కొంచెం.. కూత ఘనం..! ఏడేళ్ళకే అద్భుత ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం
Chava Tarak Nanda India Book Of Record
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 16, 2024 | 4:32 PM

సాధారణంగా ఎవరైనా ఒక నాలుగైదు దేశాల రాజధానుల పేర్లు, వాటి కరెన్సీని సులభంగానే గుర్తు పెట్టుకుంటారు. మహా అయితే మనం నిత్యం వినియోగించే పది అంకెల ఫోన్ నెంబర్లను కూడా గుర్తుపెట్టుకుంటాం. ఓ 20 దేశాల పేర్లు వాటి రాజధానులు, ఆయా దేశాల కరెన్సీని గుర్తు పెట్టుకోవాలంటే కాస్త కష్టమే..! కానీ ఏడేళ్ల బుడతడు మాత్రం వంద దేశాలు, వాటి రాజధానుల పేర్లను మాత్రం అవలీలగా చెప్పేస్తున్నాడు. ఈ బుడతడు పిట్ట కొంచెం.. కూత ఘనం.. అన్నట్లుగా తన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఈ బుడతడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ ఆశ్లేష దంపతులు స్థానికంగా ఆర్కే హాస్పిటల్‌‌ను నిర్వహిస్తున్నారు. వీరికి ఓ పాప బాబు ఉన్నారు. ఏడేళ్ళ మాష్టర్ చావా తారక్ నంద ఎల్‌కేజీ చదువుతున్నాడు. చిన్నతనం నుంచే అద్భుత ప్రతిభ కనబరుస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ బుడతడు వంద దేశాలు, వాటి రాజధానుల పేర్లను అవలీలగా చెప్పేస్తున్నాడు. దేశంలోనే వేగంగా అతి తక్కువ సమయంలో దేశాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

అతి తక్కవ సమయం 1.42 సెకండ్లలో ప్రపంచంలోని 100 దేశాల రాజధానుల పేర్లను ఏకధాటిగా చెప్పి ప్రతిష్టాత్మక ఇండియా బుక్ ఆప్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన పోటీల్లో ఈ రికార్డును చావా తారక్ నంద సాధించాడు. ఇప్పటివరకు తమిళనాడుకు చెందిన అమ్మాయి 1.59 సెకండ్లలో సాధించిన రికార్డును తారక్ నంద బ్రేక్ చేశాడు. చిన్నోడి ప్రతిభను చూసి అబ్బురపడుతున్నారు.

తారక్ నంద అక్క ఆకృతి కూడా రికార్డు హొల్దరే. గత ఏడాది ఆమె కూడా నాలుగు నిమిషాల్లో 194 దేశాలు, వాటి రాజధానుల పేర్లు గడగడా చెప్పేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రశంస పొందింది. తారక్ నందకు మాటలు వచ్చే సమయంలోనే అక్క ఆకృతి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు కోసం ప్రిపేర్ అవుతోంది. దీంతో అక్క తోపాటు ఈ బుడతడు కూడా దేశాలు వాటి రాజధానుల పేర్లను పలకడం మొదలు పెట్టాడు. డాక్టర్లుగా ఉన్న తల్లిదండ్రులిద్దరూ తారక్ నంద ప్రతిభను గమనించి అక్క ఆకృతితో పాటు తారక్ నంద కూడా ఇంట్లోనే వారు శిక్షణ ఇచ్చారు. దీంతో ఈ బుడతడు పిట్ట కొంచెం.. కూత ఘనం.. అన్నట్లుగా ప్రతిభను చాటుతున్నాడు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడంతో తారక్ నందపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమ పిల్లలిద్దరూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం గర్వంగా ఉందని తారక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. మిగిలిన విభాగాల్లో కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించేందుకు ఇద్దరికీ ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ప్రతి పిల్లల్లో ప్రతిభ ఉంటుందని దానిని గుర్తించి ప్రోత్సహిస్తే రాణిస్తారని వీరు చెబుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
నయా రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..
నయా రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ