AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఏంట్రా ఇది.. పగలు రాజకీయం.. రాత్రయితే గాల్లోకి నిమ్మకాయలు లేపుతూ తాంత్రిక పూజలు..

మారుమూల గిరిజన గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా దమ్మపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన పూజలు.. భయాందోళనకు దారితీశాయి.. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

వామ్మో ఏంట్రా ఇది.. పగలు రాజకీయం.. రాత్రయితే గాల్లోకి నిమ్మకాయలు లేపుతూ తాంత్రిక పూజలు..
Black Magic
N Narayana Rao
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Dec 07, 2025 | 3:41 PM

Share

మారుమూల గిరిజన గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా దమ్మపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన పూజలు.. భయాందోళనకు దారితీశాయి.. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అమాయక గిరిజనుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి, అలాగే భయపెట్టడానికి నారపోగు నాగరాజు అనే మాజీ సర్పంచ్ తాంత్రిక పూజలు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. తాంత్రిక విద్యలతో గాలిలో నిమ్మకాయలు నిలబెడుతూ అమాయక గిరిజనులని మభ్యపెట్టడమే కాకుండా ఓ క్షుద్ర మంత్రికుడిని తీసుకొచ్చి పూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్నం రాసులపై జంతువుల మాంసం పెట్టి రక్త తర్పణాలు చేసి క్షుద్ర శక్తులను ఆధీనంలోకి తీసుకునేందుకు మాంత్రికుడితో పూజలు చేయిస్తున్నట్టు తెలియడంతో గ్రామస్తులు మరింత భయాందోళనలో ఉన్నారు. నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడని.. క్రిమినల్ మెంటాలిటీ కలిగిన ఇతను డబ్బే ప్రధాన ధ్యేయంగా క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పలువురు పేర్కొంటున్నారు.

ఈ టెక్నాలజీ యుగంలో కూడా మూఢ నమ్మకాల పేరుతో అమాయక ప్రజలను మభ్యపెట్టి క్షుద్ర పూజలు చేస్తూ గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్న మాజీ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వీడియో చూడండి..

ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో ఇటువంటి తాంత్రిక పూజలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో మూఢనమ్మకాల పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలువురు నాయకులు, యువత కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?