AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసభ్యకరంగా తాకేవాడు.. కోడలి ఫిర్యాదుతో ప్రధాన అర్చకుడి సస్పెండ్‌.. పరారీలో మామ, భర్త..

భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. వరకట్నంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న కోడలి ఫిర్యాదుతో... ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అతని దత్తత కుమారుడు సీతారాంను ఆలయ ఈవో సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అసభ్యకరంగా తాకేవాడు.. కోడలి ఫిర్యాదుతో ప్రధాన అర్చకుడి సస్పెండ్‌.. పరారీలో మామ, భర్త..
Crime News
N Narayana Rao
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Sep 19, 2024 | 12:12 PM

Share

భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. వరకట్నంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న కోడలి ఫిర్యాదుతో… ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అతని దత్తత కుమారుడు సీతారాంను ఆలయ ఈవో సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామానుజాచార్యులకి కొడుకులు లేకపోవడంతో… సీతారాంను కొన్ని సంవత్సరాల క్రితం దత్తత తీసుకున్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన యువతితో 2019లో వివాహం జరిపించారు. వివాహం అయిన కొన్నాళ్ల నుంచి ఆమెకు వరకట్న వేధింపులు స్టార్ట్‌ అయ్యాయి. దీంతో కోడలు మామ సీతారామానుజాచార్యులు తరుచూ వేధిస్తున్నారంటూ తాడేపల్లిగూడెం పోలీస్‌స్టేషన్‌లో కోడలు ఫిర్యాదు చేసింది. తన శరీరాన్ని అసభ్యంగా తాకేవాడని.. ఇబ్బందులు పెట్టేవాడని తీవ్ర ఆరోపణలు చేసింది. భర్త, అత్తామామలు, ఆడపడుచులు అదనపుకట్నం కోసం..వేధించేవారని ఫిర్యాదులో పేర్కొంది.. రూ.10లక్షలు తీసుకురావాలని, లేకుంటే.. భర్తకు వేరే పెళ్లి చేస్తామని కొట్టి, బెదిరించేవారని బాధితురాలు పేర్కొంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడేపల్లిగూడెంలో సీతారామానుజాచార్యులు సహా 8మందిపై కేసు నమోదైంది. పలు సెక్షల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీతారామానుజాచార్యులు, అతని దత్తత కుమారుడు సీతారాం పరారీలో ఉన్నారని ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

కాగా, భద్రాచలం ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులుకి మొదటి నుంచి వివాదాస్పదుడనే పేరుంది. తొమ్మిదేళ్ల క్రితం ఆలయంలో అభరణాలు మాయమై ప్రత్యక్షమైన ఘటనలో శాఖాపరమైన చర్యలు ఎదుర్కొన్నారు. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఖగోళ యాత్రలో పాల్గొని దేవాదాయశాఖ, దేవస్థానం మార్గదర్శకాలను ఉల్లంఘించారని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..