Telangana: ట్రాక్టర్‌లో సీక్రెట్ చాంబర్‌.. అనుమానం వచ్చి చెక్‌ పోలీసులకు దిమ్మదిరిగే దృశ్యం. అసలేమైందంటే..

పోలీసులు ఎన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నా అక్రమార్కుల ఆగడాలు మాత్రం తగ్గడం లేవు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తూ యథేశ్చగా గంజాయి రాష్ట్రాలు దాటించేస్తున్నారు. యువతను నిర్వీరం చేస్తున్న గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు చేపడుతుంటే అక్రమార్కులు మాత్రం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు...

Telangana: ట్రాక్టర్‌లో సీక్రెట్ చాంబర్‌.. అనుమానం వచ్చి చెక్‌ పోలీసులకు దిమ్మదిరిగే దృశ్యం. అసలేమైందంటే..
Follow us

|

Updated on: May 29, 2023 | 4:34 PM

పోలీసులు ఎన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నా అక్రమార్కుల ఆగడాలు మాత్రం తగ్గడం లేవు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తూ యథేశ్చగా గంజాయి రాష్ట్రాలు దాటించేస్తున్నారు. యువతను నిర్వీరం చేస్తున్న గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు చేపడుతుంటే అక్రమార్కులు మాత్రం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. రకరకాల మార్గాల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం భద్రాచలం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. భద్రాచలంలోని కూనవరం రోడ్డులో గల సీఆర్పీఎఫ్ క్యాంప్ చెక్ పోస్ట్ వద్ద ఎస్సై శ్రీకాంత్ తన బృందంతో రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఒరిస్సా రాష్ట్రం మల్కన్‌ గిరికి చెందిన ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్‌లో వస్తున్నారు. చెక్‌ పోస్ట్‌ వద్ద ఆపిన పోలీసులు ట్రాక్టర్‌ను తనిఖీ చేయగా వారిలో అందులో ఓ సీక్రెట్‌ చాంబర్‌ కనిపించింది. అందులో ఏముందని చూడగా ఏకంగా 485 కిలోల గంజాయి బయట పడింది.

Ganja Smugling

ఇవి కూడా చదవండి

ఈ గంజాయిని నిందితులు కరీంగనగర్‌కు తరలిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రఘునాథ్, రవీంద్రలుగా గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మరో ఆరుగురికి భాగస్వామ్యం ఉందని పేర్కొన్న పోలీసులు… ఒక్కొక్క గంజాయి ప్యాకెట్ 5 కిలోల బరువు ఉందని, ట్రాక్టర్ లో మొత్తం 97 ప్యాకెట్లు ఉన్నాయని తెలిపారు. భద్రాచల సీఐ నాగరాజు రెడ్డి ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్​ను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..