AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు.. కృష్ణ నది తీరంలో ఆశ్చర్యకర ఘటన

జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన ఓ మొసలి ఘాట్ సమీపానికి రావడంతో భక్తులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. అయితే పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం మొసలికి ఎదురుగా కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు నిర్వహించారు.

ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు.. కృష్ణ నది తీరంలో ఆశ్చర్యకర ఘటన
Beechupally Crocodile Incident
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Aug 09, 2026 | 7:23 PM

Share

జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ సమీపానికి రావడం భయాందోళనకు గురిచేసింది. పుష్కర ఘాట్ కు వచ్చిన వారు మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆదివారం, వరుస సెలవులు కావడంతో బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ కు సందర్శకులు, భక్తులు తరలివచ్చారు. నది ఓడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని… పక్కనే కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ అనుకోని అతిథిలా.. ఓ మొసలి నదిలో నుంచి పుష్కర్ ఘాట్ కు వచ్చింది. అది చూసిన కొంతమంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఓ భవనంలోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం ప్రారంభించాడు. కుంకుమ, పసుపు, పుష్పాలతో అభిషేకం చేశాడు. మొసలి వరుణ దేవుడి వాహనమని అనిల్ శర్మ తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి, పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు ఆయన తెలిపారు.

సాధారణంగా మొసలిని దగ్గరగా చూస్తే ఎవరైనా భయపడతారు. అలాంటిది అనిల్ శర్మ మాత్రం ఏమాత్రం భయాందోళన లేకుండా మొసలికి సమీపంలో ఎదురుగా కూర్చోని చాలా సేపు పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో మొసలికి ఎదురుగా కూర్చొన్న పురోహితుడు అనిల్ శర్మ పూజలు చేస్తుంటే మొసలి మౌనంగా, ప్రశాంతంగా కదలకుండా అలానే ఉండిపోయింది. అయితే ఈ మొత్తం సీన్ ను కళ్లారా చూసిన అక్కడున్న వారు ఆశ్యర్యానికి గురయ్యారు. ఇక పూజల అనంతరం స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే పుష్కర ఘాట్ కు చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది.. మొసలిని సురక్షితంగా బంధించి.. కొంత దూరంలో నదిలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

ఏది ఏమైనా బీచుపల్లి పుష్కర ఘాట్ వద్ద మొసలి కలకలం ఒక ఎత్తైతే… ఆ మొసలికి పూజలు చేయడం… అది ఉలుకు, బెలుకు లేకుండా ఉండడం అసక్తికర చర్చకు దారితీసింది. దైవత్వం కలిగిన ప్రదేశంలో జరిగిన మహిమాన్విత ఘటనగా కొందరు భక్తులు అభివర్ణిస్తున్నారు.

అయితే.. మొసలి ప్రమాదకరమైన జీవని.. ఇలాంటి పనులు చేయిద్దంటూ ఫారెస్ట్ అధికారులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో అప్డేట్..
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో అప్డేట్..
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే