AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానంలో బాంబు ఉందంటూ ఏటీసీకి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దించారు. అనంతరం బాంబ్‌ స్క్వాడ్ వచ్చి తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Bomb Threat
Anand T
|

Updated on: Aug 31, 2026 | 7:45 PM

Share

దేశంలోని విమానాలకు వరుస బాంబు బెదిరింపు ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 10.25 గంటలకు సుమారు 32 మంది ప్రయాణికులతో ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి దిల్లీకి బయల్దేరింది. అయితే విమానం మార్గమధ్యంలో ఉండగా, అందులోని వాష్‌రూమ్‌లో “విమానంలో బాంబు ఉంది” అని రాసి ఉన్న ఒక చిన్న చీటీ సిబ్బందికి దొరికింది.

దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఏటీసీకి సమాచారం అందించడంతో విమానాన్ని వెంటనే అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. అనంతరం విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా టెర్మినల్-2కు తరలించి, ప్రత్యేక భద్రతా ప్రాంతంలో ఉంచారు. విమానంలో బాంబు ఉందేమోనని రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది, బాంబ్‌ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని స్పష్టం చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌లో 48 కేజీల బంగారు గణపతి.. ఆకట్టుకుంటున్న వినాయకుడు!
హైదరాబాద్‌లో 48 కేజీల బంగారు గణపతి.. ఆకట్టుకుంటున్న వినాయకుడు!
APPSC 163 గ్రూప్‌ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!
APPSC 163 గ్రూప్‌ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!
బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్.. ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూట
బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్.. ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూట
కోబ్రాలో ఎన్ని రకాలు ఉన్నాయి? నాగుపాముల్లో దేనికి ఎంత విషం?
కోబ్రాలో ఎన్ని రకాలు ఉన్నాయి? నాగుపాముల్లో దేనికి ఎంత విషం?
చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్థాన్
చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్థాన్
వైభవ్‌ను డ్రాప్ చేస్తే.. శ్రీకాంత్ భార్యకు ఎందుకంత కోపం?
వైభవ్‌ను డ్రాప్ చేస్తే.. శ్రీకాంత్ భార్యకు ఎందుకంత కోపం?
ఏకదంతాయ భక్తిపాటకు రాధికా మర్చంట్ అదిరిపోయే డ్యాన్స్!
ఏకదంతాయ భక్తిపాటకు రాధికా మర్చంట్ అదిరిపోయే డ్యాన్స్!
CATలో 99% వచ్చినా ఆర్మీనే ఎంచుకున్నాడు.. కట్‌చేస్తే బతుకు పోరు!
CATలో 99% వచ్చినా ఆర్మీనే ఎంచుకున్నాడు.. కట్‌చేస్తే బతుకు పోరు!
రెండు రోజులు మంచం దిగనంటున్న ఇషాన్ కిషన్
రెండు రోజులు మంచం దిగనంటున్న ఇషాన్ కిషన్
నచ్చినవాడు దొరికితే 70 ఏళ్లు వచ్చినా రెండో పెళ్లి చేసుకుంటా..
నచ్చినవాడు దొరికితే 70 ఏళ్లు వచ్చినా రెండో పెళ్లి చేసుకుంటా..