AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple: యాపిల్స్ కొనేముందు ఈ ట్రిక్స్ తెలుసుకోండి.. లేకపోతే మోసపోవడం పక్కా..

మార్కెట్‌లో ఎర్రగా, నిగనిగలాడుతూ కనిపించిందని ఆశపడి యాపిల్ కొంటే.. తీరా ఇంటికొచ్చాక అది పిప్పిలా చప్పగానో లేదా పుల్లగానో మారిందా.. పండు పైకి ఎర్రగా మెరిసినంత మాత్రాన అది లోపల తియ్యగా ఉంటుందనుకోవడం పొరపాటే.. కేవలం రంగును చూసి మోసపోకుండా, వ్యాపారులు సైతం రహస్యంగా పాటించే 5 సులువైన చిట్కాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Apple: యాపిల్స్ కొనేముందు ఈ ట్రిక్స్ తెలుసుకోండి.. లేకపోతే మోసపోవడం పక్కా..
How To Pick Sweet Apples
Krishna S
|

Updated on: Sep 22, 2026 | 9:07 PM

Share

మార్కెట్‌కి వెళ్లి ఎంతో ముచ్చటపడి యాపిల్స్ కొనుక్కొచ్చుకుంటాం. తీరా ఇంటికి వచ్చి కొరికితే.. అవి మెత్తగా చప్పగానో, లేదా ఊహించని పులుపుతోనో ఉండి మూడ్ మొత్తం పాడుచేస్తుంటాయి. చాలామంది దుకాణాల్లో యాపిల్స్ ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం పైకి ఎర్రగా, నిగనిగలాడుతూ మెరుస్తున్నాయా లేదా అని మాత్రమే చూస్తుంటారు. కానీ నిపుణుల ప్రకారం.. యాపిల్ రంగు చూసి నాణ్యతను, తీపిని అంచనా వేయడం అతిపెద్ద పొరపాటు. పండ్ల వ్యాపారులు, అనుభవజ్ఞులు పాటించే కొన్ని సులువైన మెలకువలు తెలిస్తే ఎప్పుడూ నాణ్యమైన, తియ్యటి, జ్యుసి యాపిల్స్‌నే ఎంచుకోవచ్చు. పండ్ల కొనుగోలులో తప్పక గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన చిట్కాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బరువును సరిచూడండి

ఇది చాలా సులువైన, అత్యంత కచ్చితమైన ట్రిక్. ఒకే పరిమాణంలో ఉన్న రెండు యాపిల్స్‌ను చేతిలోకి తీసుకుని చూస్తే, ఏది బరువుగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. తాజా యాపిల్ ఎప్పుడూ పరిమాణం కంటే కాస్త ఎక్కువ బరువుగా అనిపిస్తుంది. ఒకవేళ పైకి పెద్దగా కనిపించినా చేతికి తేలికగా తగిలితే.. లోపల తేమ ఆవిరైపోయి పండు ఎండిపోవడం ప్రారంభమైందని అర్థం. అలాంటి యాపిల్స్ కొరికితే పిప్పిలా, చప్పగా ఉంటాయి. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్న పండునే ఎంచుకోవాలి.

కాడ వద్ద సువాసనను పసిగట్టండి

బాగా పండిన, తియ్యటి యాపిల్స్ కాడ భాగం నుంచి సహజసిద్ధమైన మంచి సువాసన వస్తుంది. పండును ముక్కు దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు ఎలాంటి వాసన రాకపోతే.. అది చెట్టు నుంచి ముందే కోసేసిన కాయ అయినా కావాలి లేదా చాలా రోజులు నిల్వ ఉండి తన సహజ రుచిని కోల్పోయి అయినా ఉండాలి. చక్కటి మధురమైన సువాసన వస్తున్న యాపిల్ లోపల కూడా అంతే తియ్యగా, రుచిగా ఉండే అవకాశం ఎక్కువ.

తాకి చూడండి.. గట్టిదనం ముఖ్యం

కేవలం ఎరుపు రంగును నమ్మకూడదు. ఎండ తగిలే విధానాన్ని బట్టి ఒకే చెట్టు కాయల రంగుల్లో తేడాలుంటాయి. అందుకే బొటనవేలితో పండుపై మెల్లగా నొక్కి చూడాలి. చర్మం బిగుతుగా ఉండి, కాస్త దృఢంగా అనిపించాలి. ఏ చిన్న భాగంలో మెత్తగా నొక్కుకుపోయినా, లోపల కుళ్లు లేదా దెబ్బతిన్న భాగం మొదలైనట్లే లెక్క. అలాంటి పండ్లను పక్కన పెట్టేయడం మంచిది.

తొడిమ, కాడ భాగాన్ని పరిశీలించండి

యాపిల్ పైభాగంలో ఉండే కాడ దాని తాజాదనాన్ని ఇట్టే పట్టేస్తుంది. తాజాగా ఉన్న యాపిల్ కాడ కాస్త పచ్చదనంతో, గట్టిగా అతుక్కుని ఉంటుంది. ఒకవేళ కాడ ఎండిపోయి, రాలిపోయి ఉన్నా.. లేదా కాడ చుట్టూ ఉండే చర్మం ముడతలు పడి లోపలికి కుంగిపోయినట్లు కనిపించినా అది నిల్వ పండు అని గుర్తించాలి. అలాంటి పండ్లలో కరకరలాడే గుణం, తీపి తగ్గిపోతాయి.

చేతి వేలితో తట్టి శబ్దం గమనించండి

పుచ్చకాయను తట్టి చూసినట్లే యాపిల్‌ను కూడా మీ చేతి వేలితో మెల్లగా నొక్కండి. ఒకవేళ ఘనంగా, స్పష్టమైన డెన్స్ సౌండ్ వస్తే లోపల పండు గుజ్జు తాజాగా, జ్యూస్‌తో దృఢంగా ఉందని అర్థం. అలాకాకుండా డొల్లగా, ఖాళీ డబ్బా లాంటి శబ్దం వస్తే ఆ యాపిల్ లోపల ఎండిపోయి పొడిబారినట్లు సంకేతం.

పైకి మెరిసే పాలిష్, రంగులను చూసి మోసపోకుండా.. చేతికి బరువుగా ఉంటూ, దృఢంగా, మంచి సువాసనతో కూడిన యాపిల్స్‌ను ఎంచుకుంటే ప్రతిసారీ తియ్యటి, కరకరలాడే తాజా పండ్లను ఆస్వాదించవచ్చు.

Follow Us
యాపిల్స్ కొనేముందు ఈ ట్రిక్స్ తెలుసుకోండి.. లేకపోతే మోసపోతారు..
యాపిల్స్ కొనేముందు ఈ ట్రిక్స్ తెలుసుకోండి.. లేకపోతే మోసపోతారు..
ఉద్యోగులను జిమ్ బాట పట్టించేందుకు కంపెనీ మాస్టర్ ప్లాన్ అదిరింది
ఉద్యోగులను జిమ్ బాట పట్టించేందుకు కంపెనీ మాస్టర్ ప్లాన్ అదిరింది
రోజూ మెంతులు తింటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే.. !
రోజూ మెంతులు తింటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే.. !
అమరావతి లేదా విజయవాడ వేదికగా నంది ఫిల్మ్, నేషనల్ అవార్డులు
అమరావతి లేదా విజయవాడ వేదికగా నంది ఫిల్మ్, నేషనల్ అవార్డులు
బిల్వ ఆకులతో షుగర్ తగ్గుతుందా? నిపుణుల సూచన ఇదే!
బిల్వ ఆకులతో షుగర్ తగ్గుతుందా? నిపుణుల సూచన ఇదే!
భారీ వర్షాల ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..
భారీ వర్షాల ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..
టీ, స్వీట్లలో వేసే యాలకుల్లో ఇన్ని ప్రయోజనాలా?
టీ, స్వీట్లలో వేసే యాలకుల్లో ఇన్ని ప్రయోజనాలా?
నల్లమల సాగర్‌కు జలకళ.. పిక్నిక్‌ స్పాట్‌గా వెలిగొండ ఫీడర్‌ కెనాల్
నల్లమల సాగర్‌కు జలకళ.. పిక్నిక్‌ స్పాట్‌గా వెలిగొండ ఫీడర్‌ కెనాల్
గణపతి అన్నదానంలో 2000 మందికి పలావ్ రైస్.. ఎలా చేస్తారంటే!
గణపతి అన్నదానంలో 2000 మందికి పలావ్ రైస్.. ఎలా చేస్తారంటే!
పెబ్బల్ ఫిట్‌నెస్ బ్యాండ్ స్పెషలిటీస్ తెలుసుకోవాల్సిందే
పెబ్బల్ ఫిట్‌నెస్ బ్యాండ్ స్పెషలిటీస్ తెలుసుకోవాల్సిందే