శరీరానికి సోడియం ఎందుకు అవసరమో తెలుసా?

22 September 2026

TV9 Telugu

TV9 Telugu

ఉప్పు.. మన రోజువారీ వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించే పదార్థం. అయితే ఆరోగ్యంపై చర్చ వచ్చినప్పుడు ఉప్పును చాలామంది త‌ప్పుగా చూస్తుంటారు

TV9 Telugu

ముఖ్యంగా అధిక ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనే భయంతో కొందరు దాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నిస్తారు

TV9 Telugu

కానీ మన శరీరానికి సోడియం అనే ఖనిజం కూడా అవసరమే. శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాటానికి ఇది చాలా అవసరం

TV9 Telugu

అలాగే నరాల పనితీరుకు సహకరించడం, కండరాలు సరిగ్గా పనిచేయడం వంటి ముఖ్యమైన ప్రక్రియల్లో సోడియం కీలక పాత్ర పోషిస్తుంది

TV9 Telugu

సాధారణంగా మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి తగినంత సోడియం అందుతుంది

TV9 Telugu

అయితే ఎక్కువగా చెమట పట్టడం, తీవ్రమైన వ్యాయామం చేయడం, వేడి వాతావరణంలో ఎక్కువసేపు ఉండటం లేదా శరీరం నుంచి ద్రవాలు ఎక్కువగా కోల్పోతుంది

TV9 Telugu

ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రోలైట్ స్థాయిల్లో మార్పులు వ‌స్తాయి. అలాంటి సమయంలో కేవలం నీరు తాగడం మాత్రమే సరిపోదు

TV9 Telugu

శరీరంలోని ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు, సోడియం మధ్య సమతుల్యత కూడా ముఖ్యమే. అయితే ఈ లక్షణాలు కనిపించాయంటే తప్పనిసరిగా సోడియం లోపమేనని అర్థం కాదు