తాటి కల్లు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిని కనీసం వారం లేదా నెల రోజుల్లో ఒకసారి తాగినా ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చాలా మంది దీనిని తాగడానికి అంతగా ఆసక్తిచూపరు, కొందరమో దీనిని ఇష్టంగా తాగుతారు. దీనిని తాగడం వలన ఇది అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.
తాటికల్లులో విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సీ, బీ, ఐరన్ ,ప్రొటిన్స్ కూడా పుష్కలంగా ఉండటం వలన దీని వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు అంటారు.
అయితే కొంత మంది సమ్మర్‌లో దీనిని ఎక్కువగా తాగితే మరి కొంత మంది వర్షాకాలంలో కూడా తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతంటారు.
కానీ వర్షాకాలంలో దీనిని తాగడం మంచిదేనా? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.
వీలైనంత వరకు వర్షాకాలంలో తాటి కల్లు తాగకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. దీనిని తాగడం వలన అనేక సమస్యలు వస్తాయంట.
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వలన కల్లు త్వరగా పులిసిపోతుంది. అందువలన దీనిని ఎక్కువగా తాగకూడదు అని చెబుతున్నారు నిపుణులు.
ఈ సమయంలో దీనిని తాగడం వలన కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి , విరేచనాలు వంటి అనేక సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట.