మందారం టీ.. వీరికి వరం లాంటిది, తాగితే బీపీ, షుగర్ మాయం?
Samatha
31 August 2026
మందారం టీ తాగడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ప్రతి రోజూ దీనిని ఒక కప్పు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.
కాగా, ఇప్పుడు మనం మందారం టీ తాగడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
మందార టీ ప్రతి రోజూ ఒక కప్పు తాగడం వలన ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. త్వరగా బరువు తగ్గేలా చేస్తుంది.
లివర్ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ప్రతి రోజూ మందార టీ తాగడం వలన ఇది లివర్‌ను డిటాక్స్ చేస్తుంది. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
అంతే కాకుండా టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి ఇది వరం అని చెప్పాలి. ప్రతి రోజూ ఒక కప్పు మందార టీ తాగడం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది.
అంతే కాకుండా జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రతి రోజూ తాగడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ప్రతి రోజూ దీనిని కప్పు తాగడం వలన ఇది మలబద్ధకం సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
అలాగే మందారం టీ ప్రతి రోజూ తాగడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది