AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: విద్యార్థులకు ఏం జరుగుతోంది? చదువుల ఒత్తిడితో మరో డిగ్రీ స్టూడెంట్‌ ఆత్మహత్య..

చదువుల ఒత్తిడి మరో స్టూడెంట్‌ని బలితీసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ దారుణం కన్నవాళ్లను కన్నీరుమున్నీరయ్యేలా చేసింది. పావని చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Hyderabad: విద్యార్థులకు ఏం జరుగుతోంది? చదువుల ఒత్తిడితో మరో డిగ్రీ స్టూడెంట్‌ ఆత్మహత్య..
Hyd Student Sucide
Surya Kala
|

Updated on: Mar 10, 2023 | 6:56 AM

Share

మేడ్చల్ జిల్లా బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ విలేజ్‌ ఏరియాలో విద్యార్థిని ఆత్మహత్య విషాదం నింపింది. బేగంపేటలోని గర్ల్స్ డిగ్రీ కాలేజీలో పావని బీకామ్ సెకండియర్‌ చదువుతోంది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యువతి.. సడెన్‌గా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. చదువుపై శ్రద్ద పెట్టలేకపోతున్నానని.. ఆ డిప్రెషన్‌తోనే చనిపోతున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. సూసైడ్‌ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య వెనుక చదువుల ఒత్తిడే కారణమా..? ఇంకేదైనా రీజన్ ఉందా అన్న కోణంలో ఆరాతీస్తున్నారు. మరోవైపు పావని చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరోవైపు తెలంగాణాలో స్టూడెంట్స్ ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2014 నుంచి 2021 మధ్య తెలంగాణలో 3,507 విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఒక్క 2020 నుంచి 2021 మధ్య కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 31 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సగటున 438 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..